కోనసీమ తిరుపతి వాడపల్లి వెంకన్న | Vadapalli Venkateswara Swamy Temple History, Darshan Timings 2026

vadapalli venkateswara swamy temple
Spread the love

Table of Contents

Vadapalli Venkateswara Swamy Temple-కోనసీమ తిరుపతి ‘వాడపల్లి వెంకన్న’:

ఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడుకుంటే, కోనసీమలోని వాడపల్లి పేరు వినబడగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆ “ఏడు శనివారాల మొక్కు”. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలంలో ఉంది. మనసులో ఏదైనా కోరిక ఉంటే, అది తీరడం కోసం భక్తులు నమ్మకంతో వెళ్లే క్షేత్రం ఇది. చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, పక్కనే పరవళ్లు తొక్కే గోదావరి నది. ఈ ప్రకృతి ఒడిలో వెలసిన వెంకన్న స్వామిని చూస్తే మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది.

vadapalli venkateswara swamy temple

ఈ ఆలయ చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్వామి వారు ఇక్కడ ఎలా వెలిశారంటే. పూర్వం గోదావరి నదిలో కొట్టుకువస్తున్న ఒక చందన పేటిక (చెక్క పెట్టె) లో ఈ స్వామి విగ్రహం లభించిందట. అందుకే ఇక్కడి మూలవిరాట్ విగ్రహం రాతితో చేసినది కాదు, స్వచ్ఛమైన ఎర్రచందనం మొద్దుతో తయారైంది. చూడడానికి శిలలాగే ఉంటుంది. ఇలాంటి విగ్రహం మన దేశంలోనే చాలా అరుదు.

📢 Join Our WhatsApp Channel here:

button

మనసులోని కోరికలు తీర్చే ఏడు శనివారాల క్షేత్రం- Vadapalli Venkateswara Swamy Temple:

రాజమండ్రి నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో గౌతమీనది తీరాన స్వయంభుగా వెలిశాడు. ఈయనని దర్శించి ఏ ధర్మబద్ధమైన కోరిక కోరినా అది నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఇధి ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల గా పిలువబడుతుంది.

తిరుమల శ్రీవారితో సమానంగా ఆరాధిస్తారు ఇక్కడ స్వామిని. ఈ క్షేత్రానికి దర్శనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుందని చెప్తారు. ఇక్కడ స్వామివారికి సంబంధించిన ప్రతి అంశము 7 సంఖ్యతో ముడిపడి ఉంటుంది.

7 వరసల మండపం: స్వామివారి ఆలయంలోపలికి ప్రవేశించిన వెంటనే కనిపించే మండపం ఏడు వరసలతో నిర్మితమై ఉంటుంది.

7 మెట్ల ప్రదక్షణ: ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఏడు మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కి దిగి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

7 నిత్య కైంకర్యాలు: ప్రతిరోజు స్వామి వారికి ఏడు రకాల నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, సుప్రభాతం నుండి రాత్రి పవళింపుసేవ వరకు కూడా ప్రతి సేవకు ఒక నిర్దిష్టమైన సమయం ప్రాముఖ్యత ఉంటాయి.

7 ఆవరణల ఆలయం: ఆలయ నిర్మాణం 7 ఆవరణలతో విస్తరించి ఉంటుంది, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేకమైన పురాణ గాధ ఉంటుంది.

7 ప్రతీక: ఈ క్షేత్రాన్ని తిరుమల ఏడుకొండలకు ప్రతీకగా భావిస్తారు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం.

7 వారాల రహస్యం కేవలం సంఖ్య మాత్రమే కాదు, ప్రతి సంఖ్య వెనక ఆధ్యాత్మిక అర్థం ఉంది, పురాతన గాధలు ఉన్నాయి. భక్తులు ఈ ఏడు వారాల విశిష్టతను అర్థం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం.ఇక్కడ స్వామి ఎర్రచందన స్వరూపంలో ఉంటాడు.  ఇక్కడ స్వామి “శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి”.Vadapalli Venkateswara Swamy Temple

ఈ ఆలయ మూర్తికి మార్చి నెలలో ప్రతి సంవత్సరం సర్వ ఏకాదశి నుంచి ఐదు రోజులపాటు కళ్యాణ  ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు భక్తులు తరలివస్తారు, ఈ ఉత్సవాలలో ఊరిలో ఉన్న పలు వర్ణాల వారు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడ స్వామి శంక, చక్ర, నామాలతో పాటు గధా ధారుడై ఉంటారు.

స్వామి ఆలయానికి ఎడమవైపు అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ పక్కన ఉసిరి చెట్టు దాని చుట్టూ అష్టలక్ష్ములు ఉంటాయి. ఇక్కడ స్వయంభుగా వెలిసిన సుబ్రహ్మణ్య ఆలయం కూడా ఉంది.

ఏడు శనివారాల వెంకన్న (Vadapalli Venkateswara Swamy Temple) దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం:

ప్రతి శనివారం 50,000 నుండి 60,000 మంది భక్తులు స్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉదయం 11 గంటలకు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది.

వాడపల్లి వెంకన్న సన్నిధినా తులాభారం ఈతి బాధలు దూరం:

ఈ క్షేత్రంలో ఏడు శనివారాలు గాని ఏడు రోజులు వరుసగా గాని స్వామివారిని దర్శనం చేసుకుంటే అలాగే ఏడు ప్రదక్షిణలు ఆచరించి, ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఏడు వారముల ఆయన తర్వాత శ్రీవారి యొక్క అర్చనాది కైంకర్యాలు లేదా అష్టోత్తర నామార్చనా లేదా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించుకుంటే వారి యొక్క ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

Vadapalli Venkateswara Swamy Temple Pradakshina – వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ప్రదక్షిణ విధానం:

ఒక కోరిక కోరుకొని 7 ప్రదక్షిణలు చెయ్యాలి. ప్రదక్షణ ధ్వజస్తంభం నుంచి మొదలుపెట్టాలి, ఒక కాయిన్ ఒక పువ్వు పట్టుకుని ఒక్కొక్క ప్రదక్షణ చేయాలి. ఒక్కొక్క ప్రదక్షణ అయిన తర్వాత కాయిన్ హుండీలో వేయాలి. అలా ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి వారి దర్శనానికి వెళ్లాలి. అలా ఏడు వారాలు చేయాలి. ఏడు వారాల తర్వాత అష్టోత్తర పూజ లేక కళ్యాణ మహోత్సవాలు చేయించుకుంటారు. ఈ ఏడు కాయిన్స్ గుడి బయట కూడా అమ్ముతారు, కొంతమంది మోకాళ్ళ ప్రదక్షిణ కూడా చేస్తారు.

Vadapalli Venkateswara Swamy Temple: Darshan and Timings| వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం వివరాలు:

వాడపల్లి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వివిధ రకాల దర్శన సదుపాయాలు ఉన్నాయి. మీరు మీ వీలును బట్టి వీటిని ఎంచుకోవచ్చు:

  • దర్శన రకాలు: ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు, త్వరిత గతిన స్వామివారిని దర్శించుకోవడానికి ప్రత్యేక దర్శన సదుపాయాలు కూడా ఉన్నాయి.

  • టికెట్ ధరలు: ఇక్కడ సాధారణంగా ఉచిత దర్శనం (Free Darshan), ₹50 మరియు ₹200 ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి.

  • గర్భాలయ దర్శనం: ₹200 టికెట్ తీసుకున్న భక్తులను నేరుగా స్వామివారి గర్భగుడి వరకు అనుమతిస్తారు, దీనివల్ల మూలవిరాట్‌ను చాలా దగ్గరగా దర్శించుకునే అవకాశం లభిస్తుంది.

  • అష్టోత్తర పూజ: అష్టోత్తర పూజ చేయించుకోవాలనుకునే వారు టికెట్లను నేరుగా గుడి వద్ద ఉన్న కౌంటర్లలో గానీ లేదా ఆన్‌లైన్ ద్వారా గానీ తీసుకోవచ్చు.

రోజుదర్శన సమయాలు
సాధారణ రోజులు
(ఆదివారం – శుక్రవారం)
ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
తిరిగి సాయంత్రం 4:00 నుండి రాత్రి 8:00 వరకు
శనివారాలుఉదయం 4:00 నుండి రాత్రి 8:30 వరకు (నిరంతరాయంగా)

గమనిక: శనివారాల్లో ఏడు శనివారాల వ్రతం చేసే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి త్వరగా వెళ్లడం మంచిది.

ఏడు శనివారాల నోము నోచుకున్న భక్తులు అన్న ప్రసాదమునకు ఏడు గుప్పెడల బియ్యం గాని, ఏడు కేజీల బియ్యం గాని, ఏడు దోసెల బియ్యం గాని, ఏడు బస్తాల బియ్యం గాని వారి వారి స్తోమతను బట్టి స్వామివారికి సమర్పించుకోవచ్చు.

పెళ్లిరోజు గాని పుట్టినరోజు గాని 26 కేజీల బియ్యం సమర్పించిన వారి పేరున స్వామివారి నిత్య అన్నదాన ప్రసాదంలో వారి పేరున 101 మందికి అన్న ప్రసాదం అందించబడుతుంది.

Vadapalli Venkateswara Swamy Temple History – వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్ర చరిత్ర మరియు స్థల పురాణం:

పూర్వం సనకసనందనాది మహర్షులందరూ కూడా తపం ఆచరించి శ్రీవారిని వేడుకుంటారు, కలియుగంలో ధర్మం అంతరించిపోయినప్పుడు అర్చా స్వరూపంలో, తిరుమల క్షేత్రంలోనూ మరియు నౌకాపురం అనబడే ఈ యొక్క లక్ష్మీ క్రీడా స్థానమైనటువంటి వాడపల్లి దివ్య క్షేత్రంలోనూ చందన స్వరూపంగా, అర్చా స్వరూపంగా వెలుస్తామని శ్రీవారు విన్నవించి చెప్పడం జరుగుతుంది. తదుపరి ఈ సనకసనందనాది మహర్షులందరూ కూడా ఈ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపము ఆచరిస్తూ ఉండగా, కొద్ది సంవత్సరాల తర్వాత స్వామి సాక్షాత్కరిస్తారు.

ఇక్కడ వాడపల్లిలో చూస్తున్న ఈ విగ్రహ రూపంలో, ఎర్రచందన రూపంలో స్వామి ఇక్కడ సాక్షాత్కరించారు, ఇక్కడ వారందరూ కూడా తపం ఆచరిస్తూ ఆ తపో ఫలితాన్ని శ్రీవారికి ధారపోస్తూ, అర్చనాధి కైంకర్యాలు నిర్వర్తించుకుంటూ ఉండగా, ఒకానొక సమయంలో శ్రీవారి ఆజ్ఞ మేరకు, ఆ చందన వృక్ష పీఠికలో స్వామి విగ్రహాన్ని, అమ్మవారి విగ్రహాన్ని కూడా గోదావరిలో వదిలేయడం జరుగుతుంది. 1300 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఈ వాడపల్లి క్షేత్రం చేరుకున్న పిదప ఇక్కడ నదీ గర్భంలో ఉంటుంది.

ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి కలలో కనిపించి వాడపల్లి క్షేత్రంలో వెలుస్తాను. ధర్మాన్ని ఉద్ధరించే నిమిత్తంగా అర్చా స్వరూపంగా వెలుస్తానని స్వామి కలలో సంకేతం ఇస్తారు. మరునాడు గ్రామస్తులందరూ వెళ్లి ఆ ఇసుక తిన్నెలు అంతా వెతుకుతారు, కానీ స్వామి అక్కడ ఆరోజు కనిపించరు.

మళ్ళీ శ్రీవారిని ప్రార్థిస్తే అదే రోజు అపరాన్న సమయంలో గరుడ పక్షి వాలిన చోట తవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఆ మరునాడు అందరూ ఆ గౌతమీ నదిలో స్నానం ఆచరించి నది గర్భం చేరుకున్నాక గరుడ పక్షి వాలిన చోట తవ్వితే చెట్టు తొర్రలో ఒక చందన వృక్ష పేటిక లభిస్తుంది. దాన్ని యోగ్యమైన శిల్పకారుల చేత తెరిపిస్తారు.

తరువాత నారద మహర్షి అందరు రావడం జరుగుతుంది, గతంలో వైకుంఠంలో ఏదైతే సనకసనందనాధులతో స్వామివారికి జరిగిన చర్చ కార్యక్రమం గురించి వివరణ చేసి, ఈ యొక్క కలియుగాన్ని ఉద్ధరించే నిమిత్తముగా అర్చా స్వరూపంగా, “వేం” అంటే పాపములు, “కటా” అంటే నాశనం చేసేవాడని, వేంకటేశ్వరుడు ఈ దివ్యక్షేత్రంలో అవతరించడం జరిగింది.

నారద మహర్షి సప్త ప్రాకారములతో ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్టించడం జరిగింది. కాలక్రమేణా అనేక సంవత్సరములగా ఇక్కడ అర్చనాది కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. పూర్వం ఆలయం గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉండడం వల్ల నదీ గర్భంలో కలిసిపోగా తర్వాత ఇప్పుడున్న ఆలయాన్ని దీనపోతు గజేంద్రుడు అనే అగ్నికుల క్షత్రియ వంశస్థుడు నిర్మించాడు.

1700 సంవత్సరంలో దీనపోతు గజేంద్రుడు నౌకల ద్వారా అనేక దేశాలకు ఎగుమతులు, దిగుమతులు చేసి గొప్ప సంపన్నుడు అయ్యాడు. 1779 వ సంవత్సరంలో వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి, ధూప, దీప, నైవేద్యాలకు 275 ఎకరాల భూమిని, వజ్ర, వైడూర్యాలను విరాళంగా ఇచ్చారు.

Vadapalli Venkateswara Swamy Temple Seva Registration Details:

ఈ క్షేత్రంలో భక్తులు వివిధ సేవలలో పాల్గొనవచును. సేవల రిజిస్ట్రేషన్ కోసం అధికారిక వెబ్సైటు ఉపయోగించండి.

Vadapalli Venkateswara Swamy Temple Contact Details:

  • Phone Numbers: +91 8855271888 / +91 8855272666
  • Email: eovdpl@gmail.com

How to Reach Vadapalli Venkateswara Swamy Temple:

వాడపల్లి వెంకటేశ్వర స్వామి క్షేత్రం చేరుకోవడానికి ప్రధానంగా రోడ్డు మరియు రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

రైలు మార్గం

  • రాజమండ్రి రైల్వే స్టేషన్: ఇది ఆలయానికి అతి సమీపంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్. ఇక్కడి నుండి ఆలయం సుమారు  30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్టేషన్ బయట నుండి బస్సులు, ట్యాక్సీలు లేదా ఆటోల ద్వారా నేరుగా వాడపల్లి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

  • రాజమండ్రి నుండి: మీరు రాజమండ్రి నుండి ప్రైవేట్ వాహనం లేదా ఆర్టీసీ బస్సులో సుమారు 45 నిమిషాల నుండి గంటలోపు చేరుకోవచ్చు.

  • రావులపాలెం నుండి: జాతీయ రహదారి (NH-16) మీద ఉన్న రావులపాలెం నుండి వాడపల్లి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి నిరంతరం ఆటోలు మరియు బస్సులు అందుబాటులో ఉంటాయి.

  • విజయవాడ/విశాఖపట్నం నుండి: విజయవాడ నుండి సుమారు 165 కి.మీ, విశాఖపట్నం నుండి 215 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది. జాతీయ రహదారి ద్వారా రావులపాలెం చేరుకుని అక్కడి నుండి వాడపల్లి వెళ్లవచ్చు.

విమాన మార్గం

  • రాజమండ్రి విమానాశ్రయం (మధురపూడి): విమానంలో వచ్చే వారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి, అక్కడి నుండి సుమారు 40 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆలయానికి చేరుకోవచ్చు.

హైదరాబాద్ నుండి వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవడానికి ఈ క్రింది మార్గాలను అనుసరించవచ్చు:

రైలు మార్గం (అత్యంత అనుకూలమైనది)

  • రాజమండ్రి స్టేషన్: హైదరాబాద్ (సికింద్రాబాద్/నాంపల్లి/లింగంపల్లి) నుండి రాజమండ్రికి ప్రతిరోజూ అనేక రైళ్లు (ఉదా: గౌతమి, గోదావరి, గరీబ్ రథ్, వందే భారత్) అందుబాటులో ఉన్నాయి.

  • రాజమండ్రిలో దిగిన తర్వాత, స్టేషన్ బయట నుండి ఆటోలు లేదా బస్సుల ద్వారా సుమారు 30 కి.మీ ప్రయాణించి వాడపల్లి చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం

  • బస్సు ప్రయాణం: హైదరాబాద్ నుండి రావులపాలెం లేదా రాజమండ్రికి నేరుగా ఆర్టీసీ (APSRTC) మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి.

  • రావులపాలెం: మీరు రావులపాలెంలో దిగితే, అక్కడ నుండి వాడపల్లి కేవలం 10 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి లోకల్ ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.

  • సొంత వాహనం: మీరు కారులో రావాలనుకుంటే, హైదరాబాద్ – విజయవాడ – ఏలూరు – రాజమండ్రి/రావులపాలెం మీదుగా సుమారు 450 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికి దాదాపు 8 నుండి 10 గంటల సమయం పడుతుంది.

విమాన మార్గం

  • హైదరాబాద్ (RGIA) నుండి రాజమండ్రికి నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి.

  • రాజమండ్రి విమానాశ్రయం నుండి ఆలయానికి టాక్సీ ద్వారా సుమారు ఒక గంటలో చేరుకోవచ్చు.

చిన్న సలహా: మీరు శనివారం దర్శనం చేసుకోవాలనుకుంటే, శుక్రవారం రాత్రికే బయలుదేరి రాజమండ్రి లేదా రావులపాలెం చేరుకోవడం ఉత్తమం.

Google Maps Location:

మనసులో ఏదైనా కోరిక ఉండి, అది నెరవేరాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక దర్శించాల్సిన మహిమాన్విత క్షేత్రం వాడపల్లి. చుట్టూ కొబ్బరి తోటలు, ప్రశాంతమైన గోదావరి తీరం, మరియు ఆ ఏడు శనివారాల ప్రదక్షిణల నమ్మకం భక్తులకు ఒక మధురమైన ఆధ్యాత్మిక అనుభూతిని మిగిలిస్తాయి. కోనసీమ తిరుపతిగా వెలుగొందుతున్న ఈ పుణ్యక్షేత్రం, భక్తుల కష్టాలను తీర్చి సుఖశాంతులను ప్రసాదించే అభయహస్తంలా నిలుస్తోంది.

Also Read:

హైదరాబాద్ దగ్గరలో చిలుకూరు బాలాజీ దేవాలయం కోర్కెలు తీర్చే ‘వీసా బాలాజీ’ క్షేత్ర విశిష్టత గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి

గమనిక: ఈ సమాచారం భక్తుల విశ్వాసం మరియు ధార్మిక గ్రంథాల ఆధారంగా సేకరించబడింది. ఆలయ సమయాలు మరియు పూజా వివరాలలో మార్పులు ఉండవచ్చు, కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి తనిఖీ చేయగలరు.

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

About Govinda

నమస్కారం! నేను Telugushine.com వెబ్‌సైట్ నిర్వాహకుడిని. నాకు భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు మన సనాతన ధర్మంపై ఉన్న మక్కువతో ఈ వేదికను ప్రారంభించాను. పురాణాలలోని అద్భుతమైన గాథలను మరియు ఆధ్యాత్మిక రహస్యాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడమే నా లక్ష్యం.

View all posts by Govinda →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *