Makar Sankranti 2026 | సరదాల సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు తెలుసా?

Makar Sankranti 2026
Spread the love

సరదాల సంక్రాంతి పండుగను ఎందుకు జరుపుకుంటారు తెలుసా?

చలికాలపు చలి తగ్గుముఖం పట్టి, సూర్య భగవానుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభించే అద్భుతమైన సమయం వచ్చేసింది. భారతదేశమంతటా ఎంతో వేడుకగా జరుపుకునే పంట పండుగ Makar Sankranti 2026 ఈసారి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ మకర సంక్రమణం, మన జీవితాల్లోని చీకటిని తొలగించి కొత్త వెలుగులను ప్రసాదిస్తుందని నమ్ముతారు. గాలిపటాల సందడి, గొబ్బెమ్మల ముగ్గులు, మరియు కొత్త బియ్యం పొంగలి వాసనలతో ముడిపడి ఉన్న ఈ 2026 సంక్రాంతి విశిష్టత, పూజా ముహూర్తాలు మరియు సాంప్రదాయాల గురించి ఈ ఆర్టికల్‌లో పూర్తిగా తెలుసుకుందాం.

మకర సంక్రాంతి (Makar Sankranti) అంటే ఏమిటి?

Makar Sankranti 2026 తెలుగు పంచాంగం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. దీనితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. పండుగలన్నింటిలోకి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ మూడింటిని చాలా విశేషంగా మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటారు. ‘హరిలో రంగ హరి’ అంటూ వచ్చే హరిదాసులు, డూడూ బసవన్నల సందడి పల్లెటూళ్లలో పండుగ శోభను పెంచుతుంది.

సంక్రాంతికి రైతులు పండించిన పంట చేతికి వస్తుంది. పురాణాల ప్రకారం ఉత్తరాయణ కాలం దేవతలకు పగలుతో సమానం, అందుకే ఇది అత్యంత పవిత్రమైన సమయం. అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం వస్తాయి. కానీ ఒక్క సంక్రాతి మాత్రం సౌరమానం ప్రకారం వస్తుంది. మకర సంక్రాంతి జనవరిలో 13, 14, 15, 16 తేదీలలో వస్తాయి. అన్ని పండుగలు ఒక్కోసంవత్సరం ఒక్కో నెలలో వస్తాయి.  ప్రతి నెల సంక్రమణం జరుగుతుంది, అంటే సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి మారతాడు. అందులో ప్రముఖమైనది “మకర సంక్రమణం”. డిసెంబర్ నెలలో ధను సంక్రమణం జరుగుతుంది. ధనుస్సు రాశిలోకి రాగానే సంక్రాతి నెల గంట పట్టారు అంటారు. ధనుర్మాసం చేసుకుంటాము.

దేవతలకి 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రిగా వుంటుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రమణం నుంచి దేవతలు కళ్లు తెరిచి ఉంటారని చెప్తారు. కాబట్టి ఆ కాలాన్ని శక్తీ వంతమైన కాలంగా భావిస్తారు.  మకర సంక్రమణం నుంచి 6 నెలలపాటు భూమి తన బలాన్నిపుంజుకుంటుంది, ఎండ పెరుగుతుంది. ఈ 6 నెలలు ఆరోగ్యవంతమైనది.

భోగి పండుగ విశిష్టత:

ఈ “మకర సంక్రాంతికి” ముందు రోజు “భోగి” జరుగుపుకుంటారు. భోగి అంటే భోగము” అని అర్థం, భోగమును అనుభవించడం, బాహ్యంలో శరీర పోషణకి కావల్సిన ‘పంటని’, సుఖం అనుభవించడానికి కావలసిన ‘ధనాన్ని’ ఇచ్చే రోజులు కనుక “భోగి” పండుగ అంటారు.

ఈ భోగి పండుగ వచ్చేటటువంటి సమయానికి వ్యవసాయ ధారులు పంటలు కోతలు కోస్తారు, పంట ఇంటికి వస్తుంది, ఆ ధాన్యాన్ని వాళ్ళకి సంవత్సరానికి సరిపడినంత దాచుకుని, మిగిలినది అమ్మేస్తారు, దానితో ధనం వస్తుంది. అందుకే ఈ భోగి మనకి సుఖపడటానికి కావలసినటువంటి ధాన్యం, ధనం వచ్చేటటువంటి కాలం. అలాగే దక్షిణాయణంలో శరదృతువు తర్వాత వచ్చే హేమంత ఋతువు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, ఎందుకంటే ఎక్కువ చలి కారణం చేత ఆరోగ్యానికి అంత సౌకర్యంగా ఉండదు. హేమంత ఋతువు దాటి వసంత ఋతువు వస్తే మనిషికి ఆరోగ్యానికి కావల్సిన కాలం ఏర్పాటు అవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలానికి ప్రారంభం ‘భోగి’. ఇది బాహ్యంలో ఆరోగ్యాన్ని ఇచ్చే కాలం ప్రారంభమవటానికి సంకేతం. ఈ భోగి పండుగకు చాలా విశేషం ఉంది. దక్షణాయన పుణ్యకాలంలో చివరి రోజు భోగి.

దక్షిణాయణం అంతా ఈశ్వరోపాసన కాలం, అందుకే సూర్యుడు ‘కర్కాటక రాశి’లో ప్రవేశించినప్పటి నుంచి ‘మకర రాశి’లోకి ప్రవేశించే కాలం అంతా చాలా గొప్ప తిధులతో ఉంటుంది, వినాయక చవితి, దేవి నవరాత్రులు, శ్రావణ మాసం, కార్తీక మాసం ఈ కాలాలన్ని మనిషి పుణ్య కర్మలు చేసి ఆయా కాలం నందు ఏమి చేయాలో ఆయా కార్యక్రమాలు నిర్వర్తించి పుణ్యాన్ని సంపాదించుకుంటాడు, ఆ పుణ్యం చిత్తశుద్ధికి పనికొస్తుంది, అటువంటి వాళ్ళకి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, మోక్షానికి కారణం అవుతుంది.

దక్షిణాయణంలో చేసిన ఉపాసనకి ఫలితం ఉత్తరాయణంలో లభిస్తుంది. ఉత్తరాయణం ప్రారంభమైంది అంటే స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి అని అర్ధం. దక్షిణాయణంలో చేసిన పుణ్యం కారణంతో ఉత్తమమైన లోకాలను చేరుకోవడానికి కావలసినటువంటి అర్హతని పొందుతాడు. అంతరంగా భోగాన్నీ అనుభవించడానికి కావలసిన స్థితిని పొందుతాడు.

విడుదల అంటే ‘మోక్షం’, అటు వంటి మోక్షాన్ని పొందడమే నిజమైన “భోగి”. లౌకికమైన కోరికలకు దూరంగా ఉండి, అంతరమునందు భగవంతుడికి దగ్గరగా ఉంటామని చెప్పడానికి సూచనగా ‘భోగి’ మంట వేస్తారు. వీధిలో భోగిమంట వేసి, దానిలో కట్టెలు, ఆవు పిడకలు వేస్తారు. దాని అర్ధం లౌకిక కామాన్ని కాల్చేసి, ఈశ్వర కామాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తామని అర్థం.

Makar Sankranti 2026

ఈ భోగి రోజు అమ్మవారి అనుగ్రహం రేగు పండులో ప్రవేశిస్తుంది. అందుకే చిన్న పిల్లలకి జాతక రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే పోవడానికి చిల్లర పైసలు, బంతి పూలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు అన్ని కలిపి పిల్లలని కూర్చోపెట్టి, వాటిని వాళ్ళ మీద వేస్తారు, అది వాళ్ళ తల మీద నుంచి కిందకి పడితే వాళ్ళకి భోగి పీడ తొలగిపోయి, వాళ్ళు సంతోషంగా జీవించడానికి అడ్డుగా వచ్చే అనారోగ్యం ఏదైనా ఉంటే అది తొలిగిపోయి, వాళ్ళు జీవితంలో సంతోషంగా ఉండటానికి కావలసిన స్థితి ఏర్పడుతుంది. భోగి పీడ తొలగించుకునే రోజు భోగి పండుగ. భోగి రోజు బొమ్మల కొలువులు పెడతారు. ముగ్గుల పోటీలు జరుగుతాయి. గీతల ముగ్గులు వేస్తారు.

Makar Sankranti 2026

భోగి పీడ ఎలా వదిలించుకోవాలి?

  • అందరూ భోగి రోజు తలంటు స్నానం చేయాలి.
  • 5 సం॥ లోపు పిల్లలకి భోగి పళ్ళు పోయాలి.
  • ఇంటికి పట్టిన పీడ వదలాలి అంటే భోగి మంట వేయాలి. భోగి పండుగ అంటే పనికిరాని వస్తువులు వేయటం కాదు, భోగిమంట అంటే అగ్నిహోత్రం చేయడం లాంటిది, పూజని సామాన్యడి ముందుకు తెచ్చే ప్రయత్నమే భోగి మంట. భోగి మంట అంతా అయిపోయాక ఆ భస్మాన్ని నుదిటిన పెట్టుకోవాలి అందరు.
  • భోగి మంటకి మంట వేసేప్పుడు కర్పూరం, పిడకలు, ధనుర్మాసంలో పెట్టిన గొబ్బిళ్ళతో వచ్చిన పిడకలుతో వెలిగిస్తారు.
  • ఆ రోజు గోధా కళ్యాణం గుడిలో చేస్తారు.
  • భోగి రోజు నువ్వులతో చేసిన పదార్థం తినాలని శాస్త్రం.

సంక్రాంతి పండుగ విశిష్టత:

మకర సంక్రాంతి:- దీన్నే పెద్ద పండగ అంటారు, సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించిన రోజు ప్రారంభం మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది అంటే దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాలకి చాలా విశేషమైనటువంటి స్థానం కల్పించబడుతుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశించేవరకు ఉన్న కాలం ఉత్తరాయణ పుణ్య కాలం.

సంక్రాంతి రోజు మకరరాశికి అధిపతి శని, పుష్య మాసాన్ని శని మాసం  అంటారు. అందుకే నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. ఆ రోజు తప్పకుండా రుద్రాభిషేకం చేయాలి. ఇంట్లో శివలింగం ఉంటే పేరిన నెయ్యి లింగం మీద పెట్టి నెయ్యితో అభిషేకం చేయాలి. అలా చేస్తే ఏ జన్మలోనూ దారిద్య్రం  రాదు అని చెప్తారు. పురాణాల ప్రకారం సంక్రాంతి రోజు పెరుగు దానం చేస్తే చాలా మంచిది దాని వలన సంతానం, క్షేమం, ఆయుష్షు అన్ని సంపదలు కలుగుతాయి.

Makar Sankranti 2026

ఉత్తరాయణ పుణ్య కాలం చాలా తేజోవంతంగా, ఈశ్వర సంబంధమైన కార్యక్రమాలు ఏవి చేసిన చాలా గొప్ప ఫలితం అనుగ్రహించబడుతుంది, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి సమయాన్ని లెక్కించి, ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతోంది అనగానే, ప్రత్యేకంగా మకర సంక్రమణం స్నానము చేసి పితృదేవతల మొక్క సంతోషం కోసం, దేవతల యొక్క అనుగ్రహం కోసం దాన ధర్మాలనే కార్యక్రమాలని నిర్వర్తించాలి.

అటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైనటువంటి మకర సంక్రాంతిని పెద్ద పండుగగా మనం చాలా చాలా విశేషంగా జరుపుకుంటాం, ఆ పండగ రోజు కొత్త అల్లుళ్ళను ఇంటికి పిలిచి, తలస్నానం చేయించి, నూతన వస్త్రాలను ఇచ్చి, మంచి రుచికరమైన పదార్థాలలో అత్తవారి ఇంట్లో భోజనం ఏర్పాటు చేసి, విందు, వినోదాలలో జరుపుకునేటటువంటి పండుగ, పిల్లలతో, బంధువులతో, చుట్టాలతో ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ.

సంక్రాంతి పండుగ అంటే దాని శోభ, ఆనందం వేరు. ఇంటి మందు పెద్ద పెద్ద ముత్యాల ముగ్గులు వేస్తారు, రంగులతో వేసి, గొబ్బిళ్ళు పెట్టి గొబ్బిళ్లకి మీద ముగ్గు, పసుపు, కుంకుమ వేసి బంతి పూలు పెడతారు, ఆడపిల్లలు అందరూ గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ.

ఆవు పేడలోకి ఆవాహన చేయబడిన అమ్మవారి యొక్క అనుగ్రహ విశేషం చేత వారికి మంచి భర్త లభించాలని, వారి జీవితం సుఖసంతోషాలతో గడవాలని, అమ్మవారిని ప్రార్ధన చేసి, కొత్త బట్టలు వేసుకుని ప్రాతఃకాలంలోనే గొబ్బిళ్ళు పెట్టి, పాటలు పాడి నైవేధ్యం పెట్టి, ఆ నేవేధ్యాలని అందరికి పంచిపెట్టుకుని సంతోషంగా, ఆనందంగా గడిపే కాలం.

సంక్రాంతి రోజున గుమ్మడి కాయ (yellow) దానం చెయ్యాలి. సంక్రమణం కాలంలో సంక్రాంతి రోజున చేసిన దానికి మంచి ఫలితాలు వస్తాయి. గుమ్మడికాయ, విసిని కర్ర, గొడుగు, చెఱుకు, బెల్లం, నువ్వులు దానం చేయడం మంచిది. ఎవరికైతే అవసరం ఉంటుందో, వారికి సహాయం చేయవచ్చు. అన్న దానం చేసిన మంచిది. పెద్దలకి తర్పణాలు విడుస్తారు, కొంతమంది పెద్దవాళ్ళకి అన్ని పదార్ధాలు వండి, వాళ్ళ ఫొటో ఉంటె ఫొటో ముందు పెట్టి సమస్కరిస్తారు. బట్టలు కూడా పెడతారు పితృదేవతలకి.

సంక్రాంతి పురాణ కథ:

ద్రోణాచార్యుని భార్య కృపి, వాళ్ళు కఠిక పేద వాళ్ళు, ఆయన ఎప్పుడు విద్య, విద్య అనే ఉండేవాడు, ఆయన పిల్లలకి తినటానికి తిండిలేని పరిస్థితులలో ఉన్నప్పుడు దూర్వాస మహర్షి వాళ్ళ ఆశ్రమానికి వస్తారు, ద్రోణాచార్యుని భార్య వాళ్ళ పేదరికం గురించి చెప్పి భాదపడుతుంది. అప్పుడు దూర్వాస మహర్షి పెరుగు దానం చేయమని చెప్తారు. అలా పెరుగు దానం చేసి పరమేశ్వరుడికి పూజ చేస్తే అన్ని దొరుకుతాయి అని చెప్తారు, ఆవిడ ఆ మహర్షికి పెరుగు దానం చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి రాజ ఆశ్రయము దొరికి, రాజ గురువు అవుతారు. అందుకని పెరుగు దానం చేస్తే మంచిది.

ఇళ్ల ముందుకు గంగిరెద్దులు కూడా వస్తుంటాయి. ఎద్దు పూజనీయమైన జంతువు, అది పరమశివుడి వాహనం, వేదంలో ఒక మాట చెప్తుంది, ఎద్దు డెక్కలలో నుంచి అమృత బిందువులు పడతాయని చెప్తారు, వ్యవసాయం ప్రారంభం చేసేప్పుడు ఎద్దులకి నాగలి కట్టి భూమిని దున్నిస్తారు, అలా దున్నినప్పుడు దాని డెక్కల నుంచి పడిన అమృత బిందువుల చేత పవిత్రమైన భూమిలోనుంచి వచ్చిన పంట, తేజోకారకం అవుతుంది, అది కంటి సంబందమైన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అన్నం 6వ వంతు మనస్సుగా మారి, ఆ మనస్సు భగవంతుని యందు కృతజ్ఞత భావం కలిగి, శాస్త్రము నందు విశ్వాసం కలిగి 10మంది కొరకు ప్రవర్తించాలి అనే త్యాగ బుద్ధితో ప్రవర్తించాలి అనే బుద్ధిని అనుగ్రహించగలదు అటువంటి ఎద్దులని గంగిరెద్దులుగా అలంకరించి ఇంటి ముందుకు తీసుకొస్తారు.

మంగళకరమైన వాక్కులను, ఆ గంగిరెద్దుని తీసుకొచ్చిన వ్యక్తి పలుకుతాడు, మనకి తోచినంత ఇస్తే అతను పలికిన వాక్కులకు గంగిరెద్దు తల ఊపుతుంది, గంగిరెద్దు తల ఊపడం అంటే ధర్మదేవత అంగీకరించినట్టు, దాని చేత ఇల్లు వృద్ధిలోకి వస్తుంది. గంగిరెద్దుని చూసి పిల్లలు సంతోషిస్తారు. అలాగే హరిదాసులు, చేతిలో తంబురా పట్టుకుని, హరి నామ సంకీర్తన చేస్తూ ఎడమ వైపు పెద్ద జోలి తలిగించుకుని, తలమీద అక్షయ పాత్ర పెట్టుకుంటారు, వాళ్ళ కాళ్ళకి గజ్జలు కట్టుకుని చేతిలో చిడతలు పట్టుకుని వాయించుకుంటూ వెళ్తారు మరియు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు.

HariDasu on Makar Sankranti

ఆ హరిదాసుని పిలిచి బియ్యం అక్షయ పాత్రలో వేస్తారు. ఉత్తరాయణం అంటే దేవతలకి, పితృదేవతలకి, ఋషులకి, మనుష్యులకి సంతోషం, సమస్త భూతములకు సంతోషం, ప్రతి ఇంటిలో కూడా చక్కని పండుగ వాతావరణం ఉండే కాలం. ఉత్తరాయణం ప్రారంభమైతే సమస్త భూతములకు ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఎందుకంటే సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటాడు, అలా ఉంటే సూర్యకాంతి భూమి మీద విశేషంగా విస్తరిస్తుంది. అలా విస్తరించడం వల్ల సమస్త భూతములు ఆరోగ్యాన్నిపొందుతాయి. లోకంలో అన్ని ప్రాణులకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు భాస్కరుడు, అలాగే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది, వసంత ఋతువు ప్రారంభమైతే చెట్లున్ని చిగురిస్తాయి, ప్రకృతి అందంగా తయారవుతుంది. తయారవటానికి నాంది ఉత్తరాయణంలోనే జరుగుతుంది, ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన రోజు మకర సంక్రమణం(మకర సంక్రాంతి).

సంక్రాంతి పండుగకు గంగా స్నానానికి ఉన్న సంబంధం మీకు తెలుసా?

భగీరథుడి తపస్సు ఫలించి గంగమ్మ భూమిపైకి అడుగుపెట్టిన రోజే ఈ మకర సంక్రాంతి. అందుకే ఈ పవిత్ర దినాన ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు అంటారు.

కోడి పందాల పౌరుషం.. గాలిపటాల సంబరం:

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. కోనసీమలో కోడిపుంజుల కత్తులు కటకటలాడాల్సిందే! మూడు రోజుల పాటు గోదావరి జిల్లాల్లో కోడి పందేల జోరు హోరెత్తుతుంటే, ప్రకాశం వంటి ప్రాంతాల్లో ఎడ్ల పందేలు గంభీరంగా సాగుతాయి. ఒకవైపు కృష్ణా, గుంటూరులో పందెం రాయుళ్ల కేకలు.. మరోవైపు హైదరాబాద్ గాలిపటాల రెపరెపలు. ఇక గుజరాత్‌లో అయితే ఆకాశమంతా గాలిపటాలతో రంగులమయమే! పందెం ఏదైనా, ఆట ఏదైనా.. ఇవన్నీ మన సంస్కృతికి అద్దం పట్టే అచ్చ తెలుగు సంప్రదాయాలు.

Makar Sankranti 2026

కనుమ పండుగ విశిష్టత:

భూమి దున్నడంలో మనకి సహకరిస్తున్న జంతువు ఎద్దు, ఎద్దులని బండి కట్టి, పంట ఇంటికి తీసుకురావటానికి ఉపయోగిస్తారు. ఎద్దు పట్ల ప్రత్యేకమైన కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. దానికి “కనుమ” పండుగ అని పేరు..

భోగి నాడు పంట వస్తుంది, సంక్రాంతి రోజు అందరితో కలిసి సంతోషంగా భోజనం చేస్తాము. దీని అంతటికి మనతో పాటుగా ఎద్దు కూడా శ్రమిస్తుంది, అటువంటి ఎద్దుని సత్కరించకపోతే మనిషికి పూర్ణత్వం రాదు. అదే భారతీయ సంస్కృతి గొప్పతనం, అందుకే కనుమ రోజు ఎద్దులని అలంకరిస్తారు, వాటికి పూలదండలు వేసి, రకరకాల ఆభరణాల వేసి, చక్కగా పాయసం వండి ఎద్దుకి తినిపిస్తారు. అలాగే పాడికి కారణమైనది ఆవు. ఆ ఆవు వల్ల పాలు తాగుతాం, యజ్ఞయాగాది క్రతువులు చేస్తాం. అటువంటి ఆవుకీ, ఎద్దుకి కృతజ్ఞతని తెలియజేసి,  అలంకరించి ఆవుకి, ఎద్దుకి పాయసం పెట్టే రోజు. ఎక్కడెక్కడ నందీశ్వరుడు ఉంటాడో అక్కడ అలంకారం చేస్తారు, నందీశ్వరుడికి ప్రత్యేకించి అభిషేకం చేస్తారు, అరుణాచలంలో ఉండే నందీశ్వరుడికి కనుమ రోజు విశేషంగా అలంకరిస్తారు. నందితోపాటు ఆలయం బయట ఉండే పశువులని కూడా అలంకారం చేసి, ప్రత్యక్ష నివేదనగా పొంగలి పెట్టి కృతజ్ఞత తెలియజేసే పండుగ “కనుమ” పండుగ.

Makar Sankranti 2026

ఆ కృతజ్ఞత బుద్ధి మనుష్యుల యందు పెరిగిన రోజు నాగరికత సంస్కృతి పరిఢ విల్లుతాయి , కనుమ పండుగని అందరూ అటువంటి జీవనతోనే చేసుకుని భారతీయ సంసృతికి కారణం కావాలి.

కనుమ రోజు:

  1. పశువులను అర్చన చేయాలి, గోపూజ చేయాలి.
  2. కనుమ రోజు మినుములు తినాలి, అందుకే గారెలు అటువంటి పదార్ధాలు తినాలి.
  3. వడ్లు కుచ్చులు కడతారు.
  4. బొమ్మల కొలువు పెడతారు.
  5. ఇంటికి ఎవరు వచ్చిన దానం చేయాలి.
  6. హరి దాసుని గౌరవించాలి.
  7. కనుమ రోజు రథం ముగ్గు వేస్తారు.

తెలుగు రాష్ట్రాలలో విశేషంగా సంక్రాంతి పండగ రోజులలో కోడి పందాలు, ఎడ్ల పందాలు చాలా అట్టహాసంగా జరుగుతాయి..

మకర సంక్రాతి పుణ్యకాలం (Makar Sankranti 2026 Punyakalam):

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర పుష్యమాస బహుళ ఏకాదశి బుధవారం తేది. 14-01-2026 రాత్రి గం|| 08:43 ని||లకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించును. కావున తేది 15-01-2026 ఉదయం 02 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు పుణ్యకాలం ఆచరించవచ్చును.

Makara Sankranti 2026 Punya kalam

ముగింపుగా, మన సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరానికి అందించే అద్భుతమైన అవకాశం ఈ పండుగ. కోడి పందాల పౌరుషం, గాలిపటాల సందడి, పిండివంటల రుచులతో ఈ ఏడాది వేడుకలు మరిన్ని తీపి జ్ఞాపకాలను మిగిల్చాలని కోరుకుందాం. కొత్త ఆశలతో, సరికొత్త ఉత్సాహంతో వచ్చే ఈ Makar Sankranti 2026 మీ జీవితాల్లో సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను నింపాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

చిలుకూరు బాలాజీ దేవాలయం కోర్కెలు తీర్చే ‘వీసా బాలాజీ’ క్షేత్ర విశిష్టత  ఇక్కడ చదవండి

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

About Govinda

నమస్కారం! నేను Telugushine.com వెబ్‌సైట్ నిర్వాహకుడిని. నాకు భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు మన సనాతన ధర్మంపై ఉన్న మక్కువతో ఈ వేదికను ప్రారంభించాను. పురాణాలలోని అద్భుతమైన గాథలను మరియు ఆధ్యాత్మిక రహస్యాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడమే నా లక్ష్యం.

View all posts by Govinda →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *