Ugadi 2026 – శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ విశిష్టత మరియు రాశి ఫలాలు

ugadi 2026
Spread the love

ఉగాది అంటే ఏమిటి.

భారతదేశంలోని ముఖ్యమైన పండుగల్లో ఒకటైన (Ugadi 2026) ఉగాది తెలుగు ప్రజల కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచించే మహత్తరమైన పండుగ. ఉగాది అనే పదం సంస్కృతంలోని “యుగాది” అనే పదం నుండి వచ్చింది. “యుగం” అంటే కొత్త కాలం లేదా యుగం, “ఆది” అంటే ప్రారంభం. అంటే ఉగాది అనేది కొత్త యుగానికి ఆరంభం అని అర్థం.

తెలుగు రాష్ట్రాలైన Andhra Pradesh మరియు Telangana లో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఉగాది రోజున ప్రజలు తమ ఇళ్లను శుభ్రపరచి, కొత్త బట్టలు ధరించి, దేవాలయ దర్శనం చేసి, కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంటారు.

ugadi 2026

బ్రహ్మ దేవుడు ఈ సృష్టిని చైత్ర పాడ్యమి సూర్యోదయం రోజున సృష్టి ఆవిర్భావం చేశారు అని బ్రహ్మ పురాణంలో ఉంది, సృష్టి చేసి దేవతాశక్తులకు ఎవరికి వారికి వారి కర్తవ్యాన్ని అప్పగించారు. అందుకే కల్పాది అంటారు. శ్వేత వరాహ కల్పం కూడా ఈ చైత్ర పాడ్యమి రోజే ఆవిర్భవించింది అని చెప్తారు. అందుకని ఉగాది అంటారు దీనిని ” ఉగాది లేదా “యుగాది’ అని కూడా అంటారు. ఉగము అంటే సంవత్సరం. తెలుగు శాలివాహన శకం, విక్రమార్కుడికి పట్టాభిషేకం కూడా ఉగాది రోజే జరిగాయి. మనం చాంద్రమానాన్ని కాలగమనమునకు ప్రాదిపతికగా తీసుకుంటాము,  ఈ చాంద్రమానం నందు ‘చైత్ర’ మాసం మొదటి తిథి, ఆ మొదటి తిధే ఉగాది పండుగ.

📢 Join Our WhatsApp Channel here:

button

ఉగాది 2026 ఎప్పుడు?

ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి తిథి రోజున ఉగాది పండుగను హిందువులు అందరూ జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వచ్చే ఉగాది పండుగ తో సంవత్సరం పేరు మారుతుంది. 2026లో మార్చి 19న (గురువారం) శ్రీ “పరాభవ” నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇది తెలుగు వారికి ముఖ్యమై పండుగ, అంతే కాకుండా నూతన సంవత్సరానికి నాంది.

ఉగాది పాడ్యమి తిథి మార్చి 19న  ఉదయం 06:53 గంటలకు మొదలై, మార్చి 20 శుక్రవారం రోజు ఉదయం 04:52 గంటలకు ముగుస్తుంది. గురువు కర్కాటక రాశిలో మారడం, శని మీన రాశిలో సంచరించడంతో ఈ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది.

‘పరాభవ’ నామ సంవత్సరం 1966-67 లో వచ్చింది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాలు మొత్తం 60, వాటిలో ఈ పరాభవ నామ సంవత్సరం 40వది.

భారతదేశంలో ఈ పండుగని వివిధ  రాష్ట్రాల వారు వారి ప్రాంతీయ ఆచారాన్ని బట్టి చేసుకుంటారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు,కర్ణాటకలో.. ఉగాది అని , తమిళులు.. పుత్తాండు అని, సిక్కులు… వైశాఖి అని, మహారాష్ట్రలో.. గుడిపాడ్వా అని, మలయాళీలు.. విషు అని, అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు, వారి ఆచారం ప్రకారం ఘనంగా జరుపుకుంటారు.

ఉగాది పండుగ వచ్చింది అంటే మరిచిపోకుండా చేయవలసిన పనులుగా శాస్త్రంలో చెప్పబడినటువంటివి:

  • ఇల్లు శుభ్రపరచడం – ఉగాది ముందు రోజు ఇళ్లను శుభ్రపరచడం చాలా ముఖ్యమైన సంప్రదాయం. ఇది కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి చేసే పనిగా భావిస్తారు.
  • మామిడి ఆకులతో తొరణాలు – ఇంటి గుమ్మానికి మామిడి ఆకులతో తొరణాలు కడతారు. ఇది శుభానికి సంకేతంగా భావిస్తారు.
  • ముగ్గులు వేయడం – ఉగాది రోజున ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తారు. ఇది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది.
  1. అభ్యంగన స్నానం: ఉగాది రోజు బ్రాహ్మీముహుర్తం లోపు లేవాలి, కనీసం సూర్యోదయానికి ముందే  శరీరానికి నువ్వుల నూనె రాసుకుని తలంటు స్నానం చేయాలి. ఉగాది పండుగ రోజు బ్రాహ్మీముహుర్తంలో ఒంటికి నూనే రాసుకుంటే, ఆ నూనే యందు  మహాలక్ష్మి ప్రవేశించి ఉంటుంది ఆ కారణం చేత అలక్ష్మీ తొలుగుతుంది. సూర్యోదయం వరకు కూడా ఎక్కడెక్కడ  నీరు ఉంటుందో ఆ నీటిని గంగ ఆవహించి ఉంటుంది.
  2. దైవారాధన: స్నానం చేసిన తర్వాత స్తోత్రాలు, కీర్తనలు పఠిస్తూ రోజును పవిత్రంగా ప్రారంభించడం మంచిది. ఉగాది రోజున కాలపురుషుడిని ప్రత్యేకంగా పూజించాలి. మన సనాతన ధర్మంలో కాలాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు మనం చేసే పనులు సులభంగా సఫలమవుతాయి, మరికొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం కష్టమవుతుంది. ఇది అంతా కాలపురుషుడి ఆధీనంలోనే ఉంటుందని భావన. సంవత్సరంలో కాలం మారే ముఖ్యమైన సందర్భాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో ప్రత్యేక ఆరాధన చేయడం అంటే మొదట వినాయకుడిని పూజించాలి, తర్వాత పురుషసూక్తం చదవాలి, పురుష సూక్తం చదవటం రాకపోతే, విష్ణు సహస్ర నామం చదవాలి, చదవటం కాని వారు వినవచ్చు.. వాటిలో ముఖ్యమైనవి ఉగాది మరియు సంక్రాంతి.
  3. నింబఫలభక్షణం (ఉగాది పచ్చడి తినడం): శాస్త్రం ప్రకారం ఉగాది పచ్చడిని సూర్యోదయానికి ముందే తినాలి. బ్రాహ్మీముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి, ఈశ్వరుడిని ఆరాధన చేసి, ఉగాది పచ్చడిని నివేదన చేసి ప్రసాదంగా ఎవరు తీసుకుంటారో వారికి ఆ సంవత్సరమంతా సౌఖ్యదాయకమై ఉంటుంది అని శాస్త్రం.

ఉగాది పండుగ ప్రాముఖ్యత – ugadi 2026:

ఉగాది రోజున ముఖ్యంగా మూడు కార్యక్రమాలు చేస్తారు:

  1. ఉగాది పచ్చడి తినడం

  2. పంచాంగ శ్రవణం

  3. దేవాలయ దర్శనం

ఇవి తెలుగు సంస్కృతిలో చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయాలు.

ఉగాది పచ్చడి ప్రత్యేకత:

ఉగాది పచ్చడిలో వేప పువ్వు ప్రధానమైనది, ఆ వేప పువ్వు ప్రధానంగా తీసుకోవడం వల్ల 100 సం||లు. జీవించగలిగిన లక్షణం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. వేపపువ్వు సమస్తమైన సంపదలను ఇస్తుంది, అరిష్టములను తొలగిస్తుంది. వాతావరణం మార్పు సమయంలో వచ్చే వ్యాధుల నుంచి ఇది కాపాడుతుందని చెబుతుంటారు.

ఉగాది పచ్చడి షడ్రుచులతో ఉంటుంది. జీవితం సుఖదుఖాలతో ఉంటుంది, సుఖమైన, దుఃఖమైన భగవంతుని యొక్క అనుగ్రహం అని అనుభవించగలిగిన బుద్ధిని పొంది ఉండి ఉండాలి అంటే ఈ రుచులతో కూడిన  ప్రసాదాన్ని తీసుకున్నప్పుడు రుచిని చూడము ప్రసాదం అన్న భావనతో  తీసుకుంటాం. ఏ కష్టం వచ్చిన భగవంతుని పాదాలు వదలకుండా ఉండేటటువంటి బుద్ది కలగాలి అని కోరుకోవటమే ఈ ప్రసాదం స్వీకరించడంలో ఉన్న ప్రాధాన అర్ధం.

పదార్థంరుచిఅర్థం
వేప పువ్వులుచేదుకష్టాలు
బెల్లంతీపిఆనందం
చింతపండుపులుపుఆశ్చర్యం
మిరపకాయకారంకోపం
ఉప్పుఉప్పుఆసక్తి
మామిడితియ్యటి పులుపుకొత్త అనుభవాలు

దేవాలయ దర్శనం, పంచాంగాన్ని శ్రవణం చేయడం:

ఉగాది రోజు తప్పకుండా దేవాలయ దర్శనం చేయాలి. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి, భగవంతునికి నమస్కారం చేసి ఆయన కృపకి పాత్రులు కావాలి అని అర్ధం.

ఉగాది రోజున పండితులు కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగం చదివి వినిపిస్తారు. దీనిని పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది అవి తిధి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనేటటువంట 5 అంగములు కలిగినది కాబట్టి పంచాంగము అని పిలుస్తారు.

ఉగాది పండగ వచ్చె పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు. మూహుర్తాలు పెట్టె పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు, ఒక్క ఉగాది రోజు పంచాంగాన్ని చదవడం కాదు పంచాగ శ్రవణం చేయాలి.

పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి?

పంచాంగ శ్రవణం ఎందుకు వినాలి అంటే, ఏమైన ఆపదలు ఏమైనా మనకి ఉంటే దానికి నివారణకి పండితులు ఏమి చేయాలి, ఏవిధంగా భగవంతుడిని ఆరాధన చేయాలో చెప్తారు. కాల పురుషుడికి ఒక్కోసంవత్సరం ఒక్కోఅవతారం, అందులో తిధి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఆయనకి సహకరించే దేవతా శక్తులు, వాటిని మనం స్మరిస్తే కాలాన్ని మనకి అనుగుణంగా మారుతుంది. అంటే మనకి ఉన్న ఆపదలు, అవమానాలు తగ్గుతాయి దోషాలు పంచాంగ శ్రవణం వల్ల తగ్గుతాయి అని చెప్తారు.

FAQs of Ugadi 2026 Festival:

1. ఉగాది 2026 ఎప్పుడు?

ఉగాది 2026 మార్చి 19 గురువారం రోజున జరుపుకుంటారు.

2. ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు?

ఉగాది తెలుగు కొత్త సంవత్సర ప్రారంభాన్ని సూచించే పండుగ. ఈ రోజున ప్రజలు కొత్త సంకల్పాలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు.

3. ఉగాది పచ్చడి ఎందుకు తింటారు?

ఉగాది పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. ఇవి జీవితంలో వచ్చే ఆరు భావాలను సూచిస్తాయి.

4. ఉగాది పండుగ ఎక్కడ ఎక్కువగా జరుపుకుంటారు?

ఉగాది పండుగను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.

Also Read: శ్రీ క్షేత్ర గాణగాపూర్: దత్తాత్రేయ స్వామి సాక్షాత్కారం, దర్శన వివరాలు

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

About Govinda

నమస్కారం! నేను Telugushine.com వెబ్‌సైట్ నిర్వాహకుడిని. నాకు భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు మన సనాతన ధర్మంపై ఉన్న మక్కువతో ఈ వేదికను ప్రారంభించాను. పురాణాలలోని అద్భుతమైన గాథలను మరియు ఆధ్యాత్మిక రహస్యాలను అందరికీ సులభంగా అర్థమయ్యే రీతిలో అందించడమే నా లక్ష్యం.

View all posts by Govinda →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *