శ్రీశైల భ్రమరాంబిక (Srisaila Bramarambika) అమ్మవారి శక్తిపీఠం:
శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి పూజ (Srisaila Bramarambika ammavari pooja) విశిష్టత గురించి భక్తులు ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. 2025 సంవత్సరంలో ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలని ప్లాన్ చేసే భక్తులు, అమ్మవారిని ఏ పద్ధతిలో పూజిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పురాణాల ప్రకారం, భ్రమరాంబికా దేవిని భక్తితో ఆరాధించడం వల్ల అపమృత్యు భయం తొలగడమే కాకుండా, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. ఈ ఆర్టికల్‌లో శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి పూజా విధానం, కుంకుమార్చన ఫలితాలు మరియు 2025 సందర్శన నియమాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తిపీఠాలలో ఆరో స్థానంలో ఉంది. అలాగే దశ భాస్కర క్షేత్రాలలో కూడా ఇది ఆరవదిగా పరిగణించబడుతుంది. శ్రీశైలానికి సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం అనే పేర్లు ఉన్నాయి. ‘శ్రీ’ అంటే సంపద, ‘శైలం’ అంటే పర్వతం. కాబట్టి శ్రీశైలం అంటే ‘సంపదతో కూడిన పర్వతం’ అనే అర్థం వస్తుంది. ఈ ప్రాంతాన్ని ‘శ్రీకైలాసం’ అని కూడా పిలిచేవారు. సా.శ. 1313లో ఉన్న ఒక శాసన ప్రకారం, ఈ స్థలానికి ‘శ్రీకైలాసము’ అనే పేరూ ఉండేది. ఆ శాసనంలో మహేశ్వరులు శ్రీకైలాసం అయిన శ్రీశైలంపై నివసించారని పేర్కొనబడింది. చెంచు వంశానికి అల్లుడిగా చెంచు రామయ్యగా శ్రీశైలేశ్వరుడు ప్రసిద్ధి.
📢 Join Our WhatsApp Channel here:
అరుణాసురుని అమరత్వ కోరిక – దేవతల ఆందోళనకు కారణం:
ఒక అప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవిని ఉపాసన చేసాడు. తన తపస్సుతో ఆమెను ప్రసన్నం చేసి, అమరత్వం కోసం వరం అడిగాడు. కానీ గాయత్రీ దేవి, ఆ వరం ఇవ్వడం తన వల్ల కాదు, బ్రహ్మదేవుడే అలాంటి వరాలు ఇవ్వగలడని చెప్పింది. ఆమె సలహాతో అరుణాసురుడు ‘ఓం బ్రహ్మదేవాయ నమః’ అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రంగా తపస్సు చేశాడు. అతని తపస్సు అన్ని లోకాలకూ వినిపించిపోయింది. దీంతో ఆందోళనకు గురైన దేవతలు బ్రహ్మదేవుడిని కలిసి, అరుణాసురుడు అడుగుతున్న వరం చాలా ప్రమాదకరమైందని చెప్పి, ఏదైనా చేయాలని వేడుకుంటారు.
బ్రహ్మదేవుడు అరుణాసురుని ఎదుట ప్రత్యక్షమై, అతని కోరిక ఏమిటని అడుగుతాడు. అమరత్వం కోరిన అరుణాసురుని అభిలాషను విన్న బ్రహ్మ, అది సృష్టి సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేస్తాడు. అటువంటి వరం ఇవ్వలేనని చెప్పి, బదులుగా ఇంకేదైనా కోరిక కోరమని సూచిస్తాడు. దీంతో అరుణాసురుడు కొంతసేపు ఆలోచించి, రెండు లేదా నాలుగు కాళ్లు కలిగిన జీవుల వల్ల తనకు మరణం రాకూడదని వరం కోరుతాడు.
బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మంజూరు చేస్తాడు. ఆ వరానికి గర్వించి, తాను అమరుడినని భావించిన అరుణాసురుడు తన అహంకారంతో ప్రజలను పీడించటం మొదలుపెడతాడు. దేవతలకే మినహాయింపు లేకుండా వారికీ బాధలు కలిగిస్తాడు.
భ్రమరీ రూపంలో దేవి – అరుణాసురుని సంహారం:
బ్రహ్మగారు ఇచ్చిన వరం వల్ల లోకాలు అన్నిటిని శోకింపచేస్తున్నటువంటి సమయంలో, అరుణాసురుని అణచివేయలేని చేష్టలతో విసిగిపోయిన దేవతలు, తాము ఎదుర్కొంటున్న కష్టాలను శివుడు మరియు పార్వతితో పంచుకుంటారు, తల్లి భ్రమరి(తుమ్మెద) రూపాన్ని పొంది, భయంకరమైన యుద్ధం చేసింది, భ్రమరి రూపంలో ఆరు కాళ్ల తేనెటీగలను సృష్టించి ఆవిడ అరుణాసురుడుని సంహారం చేసింది. ఆ తేనెటీగల దాడితో అరుణాసురుడు మరణించాడు.
ఆ తరువాత దేవతలందరూ అమ్మవారిని స్తోత్రం చేసి, అమ్మ ఇది ఒక అద్భుతమైన రూపం ఇటువంటి పరమాద్భుతమైన రూపాన్ని నువ్వు పొంది మమ్మల్ని అందరినీ కాపాడావు, ఇలా కాపాడినటువంటి తల్లివి కనుక నువ్వు ఇదే రూపంతో ఈ భూమండలం మీద ఎక్కడ ఉండాలని అనిపిస్తే అక్కడ ఉండు.
అప్పుడు అమ్మవారు ఆలోచించి తుమ్మెద ఎప్పుడూ బాగా మకరందం ఉన్న పువ్వులు ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాలి, అందుకని ఆయన మల్లికార్జునుడు ఆయన మల్లెపూల దండను సిగకి చుట్టుకుని ఉంటాడు కాబట్టి నేను తుమ్మెద రూపంలో బ్రామరి రూపంలో శ్రీశైలంలో ఉంటాను.
శివ కేశవ అభేదంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో ఉండేటటువంటి ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి దేవాలయం వెనకాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కి పెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసినటువంటి ఝుంకారం వినబడుతుంది. ఇప్పటికీ అమ్మవారికి రెక్కలతో ఉన్నటువంటి తుమ్మెద రూపంతో అలంకారం చేస్తారు భ్రమరాంబిక అమ్మవారిని.

ఈ శ్రీశైల భ్రమరాంబిక తల్లి ముందు శంకరాచార్యులు వారు శ్రీ చక్రాలు వేశారు, ఒక్కసారి వెళ్లి భ్రమరాంబిక అమ్మవారి శ్రీ చక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేస్తే ఎన్ని జన్మలకి కూడా పూర్ణంగా మూడు తరాలు చూసి హాయిగా 10 మంది చేత పండు ముత్తయిదువ అనిపించుకుని, ఎవరింట్లో బిడ్డ పుట్టిన ఆవిడ కట్టి విప్పిన చీర తీసుకురండి అని తీసుకెళ్లి అంత సంతోష పడేటట్టుగా వారి జీవనం గడిచి వృద్ధాప్యంలో హాయిగా భర్త గారి తొడ మీద తల పెట్టుకొని ప్రాణం విడిచి పెట్టేటటువంటి అదృష్టం కలుగుతుంది.
శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి పూజ (Srisaila Bramarambika ammavari pooja):
శ్రీశైలంలో కుంకుమార్చన చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ పుణ్యక్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబికా అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన చేస్తే, సంపూర్ణ శుభఫలితాలు లభిస్తాయి.
శ్రీశైలం మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి, ఎప్పుడూ తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ ఆవిడ భ్రమరి(తుమ్మెద) రూపంలో తిరుగుతూ ఉంటుంది.
అందుకే ఇప్పటికీ ఆ నాదం (తుమ్మెద ఝుంకారం) వినబడుతూ ఉంటుంది. ఈ భ్రమరాంబిక అమ్మవారి దేవాలయంలో వచ్చేటటువంటి భ్రమరి నాదాన్ని(తుమ్మెద ఝుంకారం) ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, విజయవాడ, కర్నూల్ స్టేషన్లు రికార్డ్ చేశాయి, రేడియోలో చాలాసార్లు ప్రసారం చేశాయి, ఒక తుమ్మెద ఎగురుతూ ఉన్నటువంటి ఝుంకార ధ్వనులు ప్రసారం అయ్యాయి.
శ్రీశైల భ్రమరాంబికా దేవి ఆలయంలో జరిగే కుంకుమార్చన సమయాలు : srisaila bramarambika ammavari pooja kumkumarchana timings:
కుంకుమార్చన సమయాలు:
| సేవ రకం | ఉదయం సమయం | సాయంత్రం సమయం | టికెట్ ధర (సుమారుగా) |
| శ్రీచక్ర కుంకుమార్చన (గర్భాలయం సమీపంలో) -ప్రత్యక్ష సేవ | ఉదయం 8:00 – మధ్యాహ్నం 12:30 | సాయంత్రం 6:30 – రాత్రి 8:30 | ₹1,000 |
| ప్రాకార కుంకుమార్చన (మండపంలో) – ప్రత్యక్ష సేవ | ఉదయం 6:00 – మధ్యాహ్నం 1:00 | సాయంత్రం 6:30 – రాత్రి 9:00 | ₹500 |
| లక్ష కుంకుమార్చన – పరోక్ష సేవ | – | సాయంత్రం 5:30 గంటలకు | ₹1,116 |
ముఖ్య గమనికలు
సమయం: ఈ పూజ సాధారణంగా 30 నుండి 45 నిమిషాల పాటు జరుగుతుంది.
దుస్తుల నియమావళి (Dress Code): సాంప్రదాయ దుస్తులు తప్పనిసరి.
పురుషులు: ధోవతి లేదా పంచె మరియు కండువా.
స్త్రీలు: చీర లేదా పరికిణి. (చుడీదార్ వేసుకుంటే తప్పనిసరిగా దుపట్టా ఉండాలి).
ప్రసాదం: టికెట్ రకాన్ని బట్టి కుంకుమ, జాకెట్ ముక్క మరియు లడ్డూ ప్రసాదం అందజేస్తారు.
టికెట్ల బుకింగ్
ఆన్‌లైన్: మీరు శ్రీశైల దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. వారాంతాల్లో మరియు పండుగ రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందస్తు బుకింగ్ ఉత్తమం.
ఆఫ్‌లైన్: ఆలయం వద్ద ఉన్న కౌంటర్లలో కూడా టికెట్లు లభిస్తాయి (లభ్యతను బట్టి).
సూచన: పండుగలు లేదా విశేష దినాల్లో ఆలయ వేళల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మీరు కేటాయించిన సమయానికంటే 30 నిమిషాల ముందే క్యూ లైన్ లో ఉండటం మంచిది.
భ్రమరాంబిక అమ్మవారి స్వరూప విశిష్టత:

శ్రీశైలంలో అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా చూస్తున్నట్లు కనబడుతుంటాయి, అంత గొప్ప స్వరూపం అక్కడ శక్తి పీఠంగా ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారు, అక్కడ శ్రీ చక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకొని సౌందర్యలహరిలో నాలుగు శ్లోకాలు అయినా చదువుకుని వస్తే జన్మ ధన్యం.
అమ్మవారి విగ్రహానికి ఎనిమిది చేతులు ఉండి, పట్టు చీరను ధరించిన రూపంలో ఉంటారు, గర్భగృహంలో అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్ర విగ్రహం కూడా ఉంది.
తుమ్మెద రెక్కలు ఎలా ఉంటాయో ఆ రకంగా అమ్మవారికి అలంకరణ చేస్తారు, ఎవరైతే అమ్మవారి కన్నులు ని దర్శిస్తారో వాళ్లలో ఉండే అసుర గుణాలు తొలగిపోయి వాళ్లకి జ్ఞానం సిద్ధిస్తుంది. అలాగే అమ్మవారు తుమ్మెద రూపంలో స్వామివారికి పాద సేవ చేస్తూ ఉంటారు.
అమ్మవారి పాదాలను పట్టుకుని శరణు వేడితే మీ అభీష్టాలను ఆ అమ్మ తప్పక నెరవేరుస్తుంది. అందుకని శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అమ్మవారి అలంకరణ చూసి తరించండి.
యోగ సాధన చేసేవారు శ్రీశైల క్షేత్రంలో ఒక్క రోజైనా యోగ సాధన చేసినట్లయితే దాని యొక్క ఫలితం చాలా ఎక్కువ ఉంటుంది, అలాగే మహిళలకి శ్రీ చక్ర పూజ చాలా విశిష్టమైనది. శ్రీశైల క్షేత్రంలో ఎంతోమంది యోగులు సిద్ధులు తపస్సు చేసి యోగ సాధన ద్వారా సిద్ధింపు చేసుకున్నారు.
ముగింపు :
సకల పాపాలను హరించి, సకల శుభాలను చేకూర్చే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి పూజ – Srisaila Bramarambika Ammavari Pooja ప్రతి భక్తుడి జీవితంలో ఒక మధురమైన అనుభూతి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచే వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. మీరు 2025లో శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవాలని అనుకుంటే, పైన పేర్కొన్న పూజా విధానాలను మరియు ఆలయ నియమాలను పాటించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. భ్రమరాంబికా దేవి ఆశీస్సులు మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ… ఓం ఐం హ్రీం శ్రీం భ్రమరాంబికాయై నమః!
గమనిక: ఈ సమాచారం భక్తుల విశ్వాసం మరియు ధార్మిక గ్రంథాల ఆధారంగా సేకరించబడింది. ఆలయ సమయాలు మరియు పూజా వివరాలలో మార్పులు ఉండవచ్చు, కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి తనిఖీ చేయగలరు.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:








