DakshaRamam | దక్షారామంలో భక్తులను ఆశ్చర్యపరిచిన అద్భుత యదార్థ సంఘటన

Daksharamam
Spread the love

DakshaRamam | దక్షారామంలో భక్తులను ఆశ్చర్యపరిచిన అద్భుత యదార్థ సంఘటన:

దక్షిణ కాశీగా పిలవబడే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి క్షేత్రం మహిమలకు పెట్టింది పేరు. యుగయుగాలుగా ఈ పుణ్యధామంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని పురాణాలు మరియు చరిత్ర చెబుతున్నాయి. అయితే, కేవలం పురాణాల్లోనే కాదు, ఆధునిక కాలంలో కూడా దక్షారామంలో భక్తులను ఆశ్చర్యపరిచిన అద్భుత యదార్థ సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భక్తుల కళ్లముందే జరిగిన ఆ వింత వెనుక ఉన్న రహస్యం ఏమిటి? భక్తికి, తర్కానికి అందని ఆ అద్భుత యదార్థ సంఘటన గురించి ఈ ఆర్టికల్‌లో పూర్తి వివరంగా తెలుసుకుందాం.

దక్షారామం(DakshaRamam) అనే పేరు ఎలా వచ్చింది?

ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలలో అత్యంత శక్తిపరాక్రమ క్షేత్రమైన ద్రాక్షారామం (DakshaRamam) ప్రత్యేకమైన పురాణ విశేషాలతో ప్రసిద్ధి. దక్ష ప్రజాపతి యజ్ఞం, వీరభద్రుని రౌద్ర తాండవం, సరస్వతీదేవి ముక్కు కోయబడిన స్థలం, సప్తగోదావరి పవిత్రత ఇవన్నీ ఈ క్షేత్రాన్ని అతి శ్రేష్ఠంగా నిలబెట్టాయి.

దక్ష ప్రజాపతి యజ్ఞం చేయడం వల్ల ఆ పేరు వచ్చింది, ఈ క్షేత్రం అంత గొప్పది అవ్వడానికి కారణం మిగిలిన ఏ క్షేత్రాలలో లేని అద్భుతమైన సంఘటనలు దక్షారామంలో సంభవించాయి, ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని ధరించి పారిపోయింది లోకంలో ఎక్కడ అసలు యజ్ఞం జరుగుతుంటే, యజ్ఞం లేడీ రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది ఎక్కడా జరగలేదు, ఒక్క దక్షారామం లోనే జరిగింది, తూర్పుగోదావరి జిల్లా కోనసీమ.

Daksaramam Temple
daksharamam temple.

📢 Join Our WhatsApp Channel here:

button

ద్రాక్షారామ క్షేత్రం ఎందుకు అత్యంత శక్తివంతమైనది? 

కాశీ పట్టణంలో ఉన్న విశ్వేశ్వరుడు ఎంత శక్తివంతుడో అంతకన్నా ఎక్కువ అనుగ్రహ శక్తితో భీమనాయకుడు ద్రాక్షారామంలో ఉన్నాడు. ఆయనని “భీమ నాయకుడు” అంటారు.

draksharamam temple history in telugu ద్రాక్షారామం ఆలయ చరిత్ర:

వ్యాసమహర్షి – ద్రాక్షారామ మహిమ:

వ్యాసమహర్షి 300 మంది శిష్యులతో కలిసి దక్షారామానికి బయలుదేరి వస్తున్నాడు మధ్యలో అగస్త్య మహర్షి కనిపించారు ఆయనతో మాట్లాడుతూ పార్వతీదేవి ద్రాక్షారామ క్షేత్రం గురించి ఏమందో, అగస్త్య మహర్షికి వ్యాసమహర్షి చెప్పారు. యావత్ ప్రపంచంలో కూడా చాలా చాలా గొప్పదైనటువంటి కర్మభూమి, వేద భూమి, యజ్ఞభూమి ఈ భారతదేశం, ఈ భారతదేశం అంతటిలో కూడా గొప్పదైనటువంటి క్షేత్రం ఏది అంటే కాశీ క్షేత్రం, కానీ కాశీ కన్నా గొప్ప క్షేత్రం ద్రాక్షారామ క్షేత్రం.

భోగమోక్ష నివాసంబు దక్షారామం, అర్థ సంబంధమైన సమస్య ఉంటే, ఐశ్వర్యం సమస్య ఉంటే ద్రాక్షారామంలో భీమనాథుడిని సేవించాలి. అక్కడికి వెళ్లి భీమనాథుడిని సేవించిన, ఏదైనా ధర్మ బద్దమైన కోరిక తీర్చకపోవడం అనేది ఉండదు, ఏ ఇబ్బంది కలిగి బాధపడుతున్నామో, ఇబ్బందిని తొలగించి కాపాడగలిగినటువంటి జగద్రక్షకుడు, భీమనాథుడు అనే పేరుతో ద్రాక్షారామంలో వెలిసి ఉన్నాడు.

భీమనాథుడు తీర్చలేని కోరిక ఈ లోకంలో లేదు, దక్షారామంలో మూడు విశేషాలు ఉన్నాయని చెప్పింది “జగన్మాత” “భీమనాథుడు కన్నా గొప్ప దైవం మరొకటి ఉందని చెప్పడం సాధ్యం కాదు” ఎందుకంటే “భోగం” ఇవ్వాలన్న ఆయనే “మోక్షం” ఇవ్వాలన్న ఆయనే, గత జన్మల్లో చేసిన పాపం అడ్డొస్తే, ఆ పాపం అడ్డొచ్చి ప్రతిబంధకమై బాధపెడుతుంటే, బాధపడటం తప్ప ప్రతిబంధకాన్ని దాటి కార్యాన్ని సాధించలేము, భీమనాథుని అనుగ్రహం ఉంటే ఎట్టి పరిస్థితిలో జరగదు అనుకున్నటువంటి పని కూడా జరిగి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది దానివల్ల కార్యాన్ని సాధించగలరు.

అంత గొప్ప అనుగ్రహ ప్రదాత అందుకే భీమనాథుడు కన్నా గొప్ప దైవం లేదు ద్రాక్షారామం కన్నా గొప్ప క్షేత్రం లేదు “దక్షవాటంబు కంటే ఉన్నత పదము, సప్త గోదావరి కంటే అఖిలతీర్థ సారమైన తీర్థ రాజంబు జగతి లేదు”. జగత్తు మొత్తం మీద యావత్ భువనములలో ఉన్నటువంటి “సప్త గోదావరి” తీర్థం లాంటి తీర్థం ఇంకొకటి లేదు, అంత గొప్ప తీర్థం అక్కడే ఉంది, పైగా ఆ తీర్థాన్ని చూడడానికి ఎక్కడికో వెళ్ళనవసరం లేదు, స్నానం చేయడానికి దూరంగా వెళ్లనవసరం లేదు, దేవాలయం ఎక్కడ ఉన్నదో ఆ దేవాలయం వెనుక భాగంలో మెట్లు దిగితే సప్త గోదావరి ఉంటుంది,  ఆ క్షేత్రంలో దక్షుడు యజ్ఞం చేశాడు, యజ్ఞం చేసినప్పుడు లోకంలో ఎక్కడా లేనటువంటి రీతిలో యజ్ఞం ఒక లేడి రూపాన్ని ధరించి పారిపోయింది.

యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం:

యజ్ఞం లేడి రూపాన్ని ధరించి పారిపోవడం అనేటటువంటిది లోకంలో ఎక్కడ జరగలేదు, ఒక్క ద్రాక్షారామంలోనే జరిగింది. ఎందుకు పారిపోవలసి వచ్చింది అంటే ఒకానొకప్పుడు దక్షప్రజాపతి యొక్క ఆరామము, అక్కడ దక్ష ప్రజాపతి నివాసం చేస్తుండేవాడు, ఆయనకి ఒక కోరిక కలిగింది, పార్వతీదేవి అంటే అమ్మవారి తర్వాతే అవతారంలో ఆవిడ పార్వతి అయింది, ఆ తల్లి నాకు కుమార్తెగా రావాలని కోరుకున్నాడు, ఎవరికి కుమార్తెగా రావాలని కోరుకున్నా గాని ఆవిడ అనుగ్రహిస్తుంది, కాబట్టి కుమార్తెగా వస్తుంది, అలాగే వచ్చింది దక్ష ప్రజాపతికి. ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది కానీ మహా పతివ్రత అయిన ఆ తల్లికి భర్త మాత్రం ఒక్క పరమేశ్వరుడే.

దాక్షాయిని అనే పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతికి అనుగ్రహించడం:

ఎంతమంది పురుషులైనా ఆమెని కుమార్తెగా రమ్మని కోరవచ్చు కానీ, నేను పురుషుడిని అన్న భావంతో అమ్మవారి దగ్గర వేరొక భావనతో నిలబడ్డాడు అంటే వెంటనే అమ్మవారి కళ్ళు ఎర్రబడతాయి, కోపం వస్తుంది, ఆవిడకి నేను పురుషుడిని అన్న భావంతో అమ్మవారి దగ్గర నిలబడకూడదు అమ్మ నేను నీ కుమారుడని అమ్మ, అని మాతృభావన చేసి అమ్మవారి దగ్గర నిలబడాలి, ఒకప్పుడు దక్ష ప్రజాపతి కోరుకున్నాడు – అమ్మ నువ్వు నా కుమార్తెగా రావాలమ్మా అన్నాడు” ఆవిడ వెంటనే అనుగ్రహించి తప్పకుండా నేను నీకు కుమార్తెగా వస్తానని, ఆ తల్లి దక్షుడికి కుమార్తెగా వచ్చింది, దక్షుడికి కుమార్తెగా వచ్చింది గనుక “దాక్షాయిని” అనే పేరు వచ్చింది. “దాక్షాయి”ని అనే పేరుతో అమ్మవారే స్వయంగా కుమార్తెగా వచ్చి దక్ష ప్రజాపతికి అనుగ్రహించినప్పటికీ, ఆమె పాతివృత్యం చేత శంకరుడికే ఇల్లాలు కానీ, తరువాత కాలంలో దక్ష ప్రజాపతికి మహాశివుని యందు వైముఖ్యం పెరిగింది, అందుచేత శివుడికి హవిస్సు లేకుండా నిరీశ్వర యాగం చేయాలని సంకల్పం చేశాడు, సంకల్పం చేసి ఆ ద్రాక్షారామంలోనే ఒక గొప్ప యజ్ఞాన్ని సంకల్పించి చేయడం మొదలుపెట్టాడు.

(DakshaRamam /Draksharamam Temple) ద్రాక్షారామంలో యజ్ఞం చూడడానికి ఋషులని, దేవతలని ఆహ్వానించడం:

ఆ యజ్ఞం చూడడానికి రమ్మని ఋషులని, దేవతలని ఆహ్వానించాడు, వారందరూ కూడా వెళ్లక పోతే దక్ష ప్రజాపతి శపిస్తాడు ఏమోనని భయపడి వెళ్లారు, పార్వతి దేవి చూసింది లోకం ఎప్పుడైనా దారితప్పుతుంది, శంకరుడి పట్ల పాటించవలసిన మర్యాద పాటించకపోతే, ఆవిడ శివుడుని రుద్రుడిని చేస్తుంది, ఆయనకి కోపం తెప్పించి, లోకాన్ని శిక్షింపజేసి, మళ్లీ దారిలో పెడుతుంది. ఆవిడ అంతఃపురం మేడ మీద నుంచి చూస్తుండగా ఈ దేవతలు, మునులు, ఋషులు అందరూ ఈ యజ్ఞానికి వెళుతూ ఉంటారు, ఆవిడ చకచకా కిందకి వచ్చి శివుడికి ఒక మాట చెప్తుంది, ఓ ప్రాణ నాధా అదిగో ఆకాశమార్గంలో దేవతలు, ఋషులు, మునులు అందరూ కూడా నా తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తున్నారు, నాకు కూడా యజ్ఞం చూడాలని ఉంది, అందుకని నేను కూడా వెళ్తాను అంది.

అయితే నిన్ను నన్ను పిలవలేదు కదా పిలవకుండా ఎందుకు వెళ్తావు అంటావేమో, పిలవకపోయినా నలుగురు ఇంటికి వెళ్ళవచ్చు.

  • తండ్రిగారి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే కూతురు, అల్లుడు వెళ్ళవచ్చు
  • గురువు గారి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు
  • మంచి స్నేహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ప్రత్యేకంగా పిలవక్కర్లేదు వెళ్ళవచ్చు 
  • అలాగే రాజ్యాన్ని పాలించే రాజుగారు ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే వెళ్లవచ్చు.  

నా తండ్రి కాబట్టి దక్ష ప్రజాపతి ఇంటికి వెళ్లవచ్చు కాబట్టి నేను వెళ్తాను. శివుడు అన్నాడు “నువ్వు వెళ్తే నాకు అభ్యంతరం లేదు, చాలా దుష్టమైన స్వభావం కలిగినటువంటి వారు, వారి ఇంటికి ఎవరైనా వెళ్తే, అవతలి వారు అంటే ఇష్టం లేదు కనుక, వాళ్లు వచ్చినటువంటి వారితో ప్రేమతో మాట్లాడరు కోపంతో చూస్తారు, పలకరించరు, అలా పలకరించకపోతే వెళ్లినటువంటి వారికి చాలా అవమానంగా ఉంటుంది, నా మాట విను పార్వతి. నిజానికి కుమార్తె అందరిలోకి దక్షుడికి నువ్వంటేనే చాలా ఇష్టం కానీ, ఇవాళ నా మీద దక్షుడు చాలా కోపం పెట్టుకున్నాడు, నువ్వు నా భార్యవి అందుకే నిన్ను చూడగానే నేను జ్ఞాపకానికి వస్తాను, నిన్ను పలకరించడు, పదిమందిలో అవమానిస్తాడు కాబట్టి నా మాట విను నువ్వు వెళ్ళవద్దు ఆ యాగానికి అని అన్నాడు. కాదు నేను వెళతాను అంది అమ్మవారు.

భర్త మాట కాదని నిజంగా వెళుతుందా అమ్మవారు, ఆవిడ ఎందుకు వెళుతుంది అంటే ఒక్క కారణానికి వెళ్తుంది, శంకరుడి విషయంలో దారి తప్పి తప్పు చేస్తున్నాడు, తండ్రి అయినా సరే దక్ష ప్రజాపతి కొడుకుతో సమానమే తత్వంలో, ఆ యజ్ఞానికి దేవతలు వెళ్లారు, మునులు వెళ్లారు, ఋషులు వెళ్లారు ఇలా లోకం దారి తప్పడానికి వీల్లేదు, వాళ్లందరూ ఆమె బిడ్డలు, ఎందుకని “ఆబ్రహ్మకీట జనని”, ఈ సమస్త విశ్వమునకు ఆమె తల్లి, తండ్రి పట్ల వాళ్లు తప్పుగా ప్రవర్తిస్తుంటే, ఆయనకి కోపం తెప్పించి వాళ్ళకి శిక్ష వేయించి, వాళ్ళని మళ్లీ సరైనటువంటి మార్గంలో నడిచేటట్టుగా చెయ్యాలి ఆవిడ.

అందుకే శంకరుడితో నేను వెళ్లి తీరాలి యజ్ఞానికి అని చెప్పి ఆవిడ బయలుదేరింది, బయలుదేరి ద్రాక్షారామ క్షేత్రానికి (DakshaRamam) వచ్చింది, అక్కడే దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు, ఆవిడ వస్తుంటే ఆవిడతో పాటు ప్రమధగుణాలు కూడా బయలుదేరి వచ్చాయి, వచ్చిన తర్వాత తిన్నగా అక్కడికి వెళ్ళింది, దక్ష ప్రజాపతి పలకరించలేదు, ఆ యజ్ఞభూమిలో ఉన్నటువంటి ఎవరూ కూడా పలకరిస్తే దక్ష ప్రజాపతికి కోపం వస్తుందేమోనని పలకరించడం మానేశారు, ఆవిడకి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది, భర్తని గౌరవించని చోట నేను నిలబడను అనుకుంది, వెంటనే దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్లి ఆవిడ ఒక ప్రశ్న వేసింది, నువ్వు ఆయన ఏదో మెడలో పుర్రెల మాల వేసుకుంటాడని, స్మశానవాసి అని నింద చేస్తున్నావు కానీ, నిజానికి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు కూడా ఆ పరమ శివుడి పాదములలో ఉన్నటువంటి ధూళిని తీసి శిరస్సు మీద జల్లుకుంటున్నాడు.

ఆయన పైకి అలా కనపడతాడు గాని, లోకములను కాపాడడం కోసం అలా ఉంటున్నాడు తప్ప స్మశానంలో చిట్టచివర తీసుకెళ్లి వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత దహించేస్తారు, అప్పుడు జీవుడు శరీరంలో నుంచి లేచి నిలబడితే తన వారన్నవారు అందరూ వెళ్ళిపోతారు కాలిపోయిన తర్వాత, వాడొక్కడే స్మశానంలో మిగిలిపోతాడు నేనున్నాను అని నిలబడే వాళ్ళు ఎవరూ ఉండరు, వాడొక్కడే ఉండిపోతే బెంగ పెట్టుకోకు రా నేనున్నాను అని ఓదార్చడానికి శంకరుడు అక్కడ ఉన్నాడు.

అటువంటి వాడిని పట్టుకొని శంకరుడు గురించి మాట్లాడుతున్నావే, ఆ శంకరుడు యొక్క పాదముల యొక్క ధూళి నీ తండ్రి చతుర్ముఖ బ్రహ్మ గారు తీసి రోజు నెత్తి మీద చల్లుకుంటాడు, నీకు బుద్ధి లేదా తండ్రంతటి వాడు శంకరుడు పాద రేణువులను తీసి తలమీద చల్లుకుంటుంటే నువ్వు శివుడిని నింద చేసి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావే, నేను నీకు కుమార్తెనై పుట్టాను కాబట్టి “దాక్షాయణి” అని పేరు పెట్టుకున్నాను, నీ యొక్క కీర్తి ప్రకాశించడం కోసం “దాక్షాయిని” అని పిలిచి నప్పుడల్లా దక్షుడు కూతురు అని అందరికీ గుర్తు రావాలి అని నేను “దాక్షాయిని” అని పేరు పెట్టుకున్నాను పరమశివుడికి కోపతాపాలు ఉండవు, నువ్వు ఒకవేళ ఇలాంటి విరోధ భావంతో ప్రవర్తించిన శంకరుడు మాత్రం మనసులో పెట్టుకోడు.

కానీ ఆయన పట్ల ఇటువంటి వైశమ్యం తో ప్రవర్తిస్తున్నావే నేను తిరిగి వెళ్ళిన తర్వాత పరమశివుడు పరమ ప్రీతితో “దాక్షాయిని” అని నన్ను పిలిస్తే, నా మనసు చివిక్కుమంటుంది. నేను నీకు కూతురై వచ్చినందుకు ఆ పేరు పెట్టి పిలుస్తుంటే, నాకు శంకరుని నింద చేస్తున్నావన్నమాట గుర్తొస్తే, నీకు కూతురుగా ఉండకూడదని అనిపిస్తుంది అందుకే ఈ శరీరంతో నేను ఉంటే నీ పేరుతో నన్ను కలిపి దాక్షాయని అని పిలుస్తారు అందుకని ఇక నేను ఈ పేరుతో ఈ భూమి మీద ఉండను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది, ప్రతిజ్ఞ చేసి ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పి ఆ తల్లి యోగాగ్నిని రగిల్చి   అందులో తన శరీరాన్ని త్యాగం చేసేసింది.

Daksharamam

ప్రమద గణాలు చెప్పిన మాటతో పరమ శివుడికి కోపం వచ్చిన సందర్భం:

ఈ వార్త ప్రమద గణాలు శంకరుడితో చెప్పారు ఆ మాట విన్నాడు శంకరుడు అప్పటివరకు పరమ ప్రశాంతంగా కూర్చున్నటువంటి స్వామి ఒక్కసారి రౌద్రాన్ని పొందాడు, ఆయనని రుద్ర మూర్తిని చేసి కోపం వచ్చేట్టు చేసి దారి తప్పిన పిల్లల్ని శిక్ష వేయించి మళ్లీ వాళ్లని సక్రమమైన మార్గంలో నడిచేటట్టుగా చేయడం కోసం కదా అమ్మవారి ప్రయత్నం చేసింది అందుకని ఆ తల్లి ఎప్పుడైతే శరీరాన్ని యోగాగ్నిలో త్యాగం చేసింది అన్నమాట శంకరుడు విన్నాడో ఒక్కసారి కోపం వచ్చి ఆకాశంలో వర్షం వచ్చే ముందు నల్లని మబ్బు మధ్యలో విరిసేటటువంటి మెరుపు ఎలా ఉంటుందో అటువంటి ఒక జడని పెరికి దాన్ని తీసి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి ఒక శిల కి వేసి కొట్టాడు, కొట్టేటప్పటికీ అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి శరీరం ఒకటి పుట్టి అది భూమి మీద పాదాలు ఉంటే ఆకాశానికి తల తగిలేటట్టుగా లేచి నిలబడింది.

ఆ పుట్టినటువంటి ప్రాణికి వీరభద్రుడు అని పేరు ఆయన భూమి ఆకాశంలో ఏకమై పోయేటట్టుగా అంత ఎత్తున శరీరం ఉండేటట్టుగా పుట్టాడు ఆయన వెంట్రుకలు ఇలా నిలబడితే ఏదో అగ్నిహోత్రం వెలుగుతుంటే ఎలా ఉంటుందో వెంట్రుకల మీద దీపాలు పెడితే ఎలా ఉంటుందో అలా ప్రకాశిస్తూ మంటలు మండుతున్నట్టుగా ఉంది, వేయి బాహువులతో అనంతమైనటువంటి ఆయుధాలు చేతిలో పట్టుకుని పరమశివునికి ప్రదక్షిణం చేసి, శివ.. మీదేమీ ఆజ్ఞ దేని చేత మీరు నన్ను సృజించారు అని అడిగాడు, దక్ష ప్రజాపతి ద్రాక్షారామంలో (DakshaRamam) నాకు వ్యతిరేకంగా నాకు హవిస్సు లేనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, అలా యాగాన్ని చేసినటువంటి కారణం చేత మీ తల్లి అయినటువంటి ఆ జగదాంబ అక్కడికి వెళ్లి యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టింది, కాబట్టి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చెయ్ అన్నాడు.

వెంటనే బయలుదేరి వీరభద్రుడు దక్షారామ క్షేత్రానికి వచ్చాడు, వీరభద్రుడు ప్రళయకాల భయంకరమైనటువంటి స్వరూపంతో వచ్చి అవే ఈ చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు పైకి తీసి దక్షయజ్ఞాన్ని అని ధ్వంసం చేస్తూ ఉంటే అసలు ఎప్పుడూ ఎక్కడా జరిగినటువంటి రీతిలో యజ్ఞం భయపడిపోయి, యజ్ఞం ఒక లేడి రూపాన్ని ధరించి, లేడిగా అయితే తొందరగా పరిగెత్తి పారిపోవచ్చని యజ్ఞం మొట్టమొదటిసారి భారతదేశంలో లేడి రూపాన్ని ధరించి వీరభద్రుడికి దొరక్కుండా పారిపోయినటువంటి భూమి ద్రాక్షారామము, సాక్షాత్తు సరస్వతి దేవి కూడా దక్షయజ్ఞ్యానికి వచ్చింది పరమశివుడికి హవిస్సులేని యజ్ఞం జరుగుతోందని తెలిసి కూడా, బ్రహ్మ గారి కొడుకు గనుక, కొడుకు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దక్ష ప్రజాపతి తప్పు చేస్తున్నాడని తెలిసి, వచ్చి కూర్చుని వీణ వాయిస్తుంది మంచి పారవశ్యంలో ఉంది.

వచ్చినటువంటి వీరభద్రుడు దక్షయజ్ఞం అంతటినీ ధ్వంసం చేస్తున్నాడు వచ్చిన వాళ్లందర్నీ చితకొట్టేస్తున్నాడు, అక్కడ కూర్చున్నది సరస్వతి దేవి, ఆవిడ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తిస్తే బాగుండదని సరస్వతి దేవి దగ్గరికి వెళ్లి తన యొక్క రెండు గోళ్ళతోటి ఆవిడ యొక్క ముక్కు పట్టుకుని గట్టిగా గిల్లి తిప్పి లాగేసాడు, సరస్వతి దేవి యొక్క ముక్కు ఊడి పడిపోయినటువంటి క్షేత్రం ద్రాక్షారామం.

తర్వాత మళ్లీ ముక్కు పెట్టాడు పరమశివుడు, అగ్నికి ఏడేసి నాలుకలు ఉంటాయి ఆ నాలుకలు చాపి ఆయన హవిస్యలు పుచ్చుకుంటూ ఉంటాడు నాలుకల చాపి పుచ్చుకుంటున్నట్టుగా, జ్వాలలు తీసుకుంటూ ఉంటాడు, ఆ ఏడు నాలుకలు చాపుతాడు, ఆ దక్షయజ్ఞంలో మూడు వేదికల మీద త్రేతాజ్ఞులు ఉండి స్వాహా అనే ఇస్తున్నటువంటి హవిస్యలు, ఆజ్యాన్ని అగ్నిహోత్రుడు నాలుకను చాపి పుచ్చుకుంటున్నాడు, వీరభద్రుడు చూశాడు, పరమశివుడికి హవిస్యలు లేకుండా యజ్ఞంచేస్తుంటే, హవిసపుచ్చుకుంటున్నావా అని బలవంతంగా నోరు నొక్కిపెట్టి పట్టుకుని, ఆ ఏడేసి నాలుకలు లాగి పట్టుకుని, కొండ నాలుకల వరకు కోసేశాడు, మూడు అగ్నిహోత్రాలకి కొండ నాలుకల వరకు కోసేశాడు, మూడు అగ్నిహోత్రాలకి కొండ నాలుకల వరకు ఏడేసి నాలుకలు కోతబడినటువంటి క్షేత్రం దక్షారామ క్షేత్రం దక్షారామం.

 బాల సూర్యుడు దక్షయజ్ఞ్యానికి వచ్చి కూర్చున్నాడు, వీరభద్రుడు చూశాడు, నువ్వు కూడా వచ్చి కూర్చున్నావా ఇక్కడ అని, ఆయన నోరు గట్టిగా దవడలు నొక్కి పెకలించి నోట్లో ఉన్నటువంటి పళ్ళని పీకేసి కింద పడేసాడు, ఆ పూష అని పేరు కలిగినటువంటి బాల సూర్యుడు నోటిలో ఉన్నటువంటి పళ్ళని రాలిపోయినటువంటి క్షేత్రం దక్షారామం, అప్పటి నుంచే సూర్యనారాయణమూర్తికి పాయసాన్నం నైవేద్యం, దక్ష ప్రజాపతి గొప్ప తపస్సు చేశాడు, మిగిలిన వాళ్ళందరినీ పడగొట్టగలిగారు కానీ దక్ష ప్రజాపతిని పడగొట్టడం అంత తేలికకాదు.

Daksa Ramam

అందుకే వీరభద్రుడు ఏం చేశాడంటే ఆ దక్ష ప్రజాపతి యొక్క గుండెల మీద మోకాలు ఉంచి, ఆయన తలకాయని గిరగిర గిరగిర తిప్పి ఊడవిరికి ఆ యజ్ఞగుండంలో పారేశాడు, అది ఆ యజ్ఞంలో దగ్ధమైపోయింది, మొండెం ఒకటే మిగిలిపోయింది, తర్వాత బుద్ధి తెచ్చుకున్నటువంటి దక్ష ప్రజాపతి, దక్షిణామూర్తిగా కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పరమశివుని వెళ్లి ధ్యానం చేసి ఆరాధించాడు, బోలా శంకరుడు కనుక ఎంత కోపం వచ్చిందో, అంత తేలికగా అనుగ్రహించగలడు.

(వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అని పేరు, ఆయన లోకములన్నింటికీ తండ్రి కనుక అపారమైనటువంటి దయ కలిగిన వాడు కనుక, ఇంతలో కోపం వస్తే అంతలో వదిలి పెట్టేయగలిగినటువంటి వాడు కనుక, నిజానికి పరమశివునికి కోపం రావడం అనేటటువంటి మాట ఉండదు, ఎందుకంటే ఈ మాట వేదంలో చెప్పబడింది, వేదం ఆయన గురించి చెప్తూ ఒక మాట చెప్పింది, “సదాశివాయ” అంది, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మ్రుత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః అంటారు.

అలాగే శంకరుడు గురించి పంచబ్రహ్మ  మంత్రాలు చదివినప్పుడు కూడా ఆయన గురించి ఒక మాట చెప్తారు సమస్త విద్యలకు ఆలవాలము నువ్వే అని ఆయన గురించి చెప్తూ, అటువంటి వాడివైనటువంటి ఓ శివ సదాశివాయ అని పిలుస్తారు ఆయన ఒక్కడినే, సదాబ్రహ్మయా అన్నమాట లోకంలో లేదు, సదా విష్ణు అన్న మాటలు లేదు సదాశివ ఉంది లోకంలో, శివ అంటే మంగళ ప్రధుడు, శివ అంటే శుభములు ఇచ్చువాడు శివ అంటే క్షేమంకరుడు, శివ అంటే ఎప్పుడు అవతల వారి యొక్క అభ్యున్నతిని కోరుకునేటటు వంటివాడు, శివుడికి కోపం ఎందుకు వచ్చింది అంటే లోకాన్ని నిగ్రహించడానికి కోపం వచ్చినట్టు నటిస్తాడు, శంకరుడు కూడా అవసరాన్ని బట్టి కోపాన్ని నటిస్తాడు.

యజ్ఞం పూర్తిగా జరగడం ఆగిపోయిన తర్వాత మళ్లీ వెళ్లి దక్షిణామూర్తిగా కూర్చున్నటువంటి శంకరుడి దగ్గర దక్ష ప్రజాపతి యొక్క జీవుడు ఏడ్చి, క్షమాపణ చెప్పి, ప్రార్థన చేస్తే, శంకరుడు అనుగ్రహించి గొర్రె యొక్క తలకాయ నీకు ఇస్తున్నాను అని, ఇకపైన గొర్రె తలకాయ పెట్టుకో అని అనుగ్రహించాడు. చంద్రుడు ఆ సభకి వచ్చాడు నానా కష్టాలు పడ్డాడు, అంత ఆదరించిన శంకరుడిని కాదని వచ్చినందుకు పడరాన్ని ఇడుములన్ని చంద్రుడు పడినటువంటి క్షేత్రం దాక్షారామ క్షేత్రం, మహానుభావుడు శంకరుడు చంద్రుడికి ఇచ్చిన స్థానం అంతటిది ఇంతటిది కాదు, నిజానికి చంద్రుడు ఎన్నో కలంకాలను తెచ్చుకున్న, ఆయనకు ఉన్నటువంటి అందరి భార్యలతో సమానంగా ఉండకుండా ఒక రోహిణి పట్ల ప్రేమగా ఉండి, దక్షప్రజాపతి ఆగ్రహానికి కారణమే క్షయవ్యాధిగ్రస్తుడైన, లోకం చేత నిందించబడిన, లోకం చేత అపహసించబడిన వాడైనా సరే, శంకరుడిని భక్తితో నమ్ముకున్నాడు కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి, చంద్రుడిని తలపై ధరించినటువంటి కారుణ్యమూర్తి శంకరుడు.

అటువంటి కారుణ్య మూర్తిని వదిలిపెట్టి దక్షయజ్ఞంకి వెళ్ళినందుకు పడరాని ఇనుములన్నీ పడ్డాడు వీరభద్రుని చేతిలో. వీరభద్రుని విజృంభణ ఇంతమందిని దారిలోకి తీసుకొచ్చి, దక్షయజ్ఞంలో ఎంతమందిని ఇలా అలా కాకుండా హింస పెట్టినటువంటి క్షేత్రం ఏది ఉన్నదో, శంకరుడు వీరభద్రుడు ద్వారా లోకాన్ని మళ్లీ దారిలోకి తెచ్చినటువంటి క్షేత్రం ఏది ఉన్నదో అది ద్రాక్షారామ క్షేత్రం, ద్రాక్షారామంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద మునులందరూ కూడా ద్రాక్షారామం (DakshaRamam) యొక్క వైభవం గురించి అన్ని విశేషాలు జరిగినటువంటి క్షేత్రమని అంత గొప్పగా చెప్తారు.

DakshaRamam క్షేత్రం గురించి మరిన్ని విషయాలు ఇక్కడ చదవండి

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *