Daksaramam Temple 12th Sakthi Peetham Secrets – ఎందుకు దక్షారామాన్ని ‘దక్షిణ కాశీ’ అంటారు?

Daksaramam Temple
daksharamam temple
Spread the love

Daksaramam Temple 12th Sakthi Peetham Secrets – ఎందుకు దక్షారామాన్ని ‘దక్షిణ కాశీ’ అంటారు?

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెంది, పంచారామ క్షేత్రాలలో అత్యంత మహిమాన్వితమైనదిగా వెలుగొందుతున్న పుణ్యధామం Daksaramam Temple (Sri Manikyambadevi Sametha Sri Bheemeswara swami temple). ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ ప్రాంతంలో వెలిసిన ఈ ప్రాచీన క్షేత్రం భక్తులకు అటు శివుని అనుగ్రహాన్ని, ఇటు మాణిక్యాంబా దేవి శక్తి పీఠ వైభవాన్ని ఒకే చోట ప్రసాదిస్తుంది. భీమేశ్వర స్వామి లింగ రూపం మరియు దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన పవిత్ర భూమిగా ఈ Daksaramam Temple కు సాటిలేని చారిత్రక మరియు పురాణ ప్రాముఖ్యత ఉంది. శిల్పకళా సంపదతో అలరారుతున్న ఈ ఆలయ చరిత్ర, విశిష్ట పూజలు మరియు దర్శన వివరాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

దక్షారామము (Daksaramam Temple) ఎందుకు ప్రత్యేకం:

దక్షారామము (Daksaramam Temple), పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ఉంది, ఈ దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠం. ఈ దేవాలయం “మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం” ద్రాక్షారామం, ఇక్కడ లింగం “సుద్ద స్పటిక లింగం”. దక్ష ప్రజాపతి యజ్ఞం చేయటం వలన ఈ క్షేత్రానికి ద్రాక్షారామము అని పేరు వచ్చింది

భారతదేశంలో ఉన్నటువంటి క్షేత్రాలలో పరమ పఖ్యాతమైనటువంటిది, పరమాద్భుతమైనటువంటి క్షేత్రం  దక్షారామము క్షేత్ర వైభవాన్ని ప్రకాశింప చేయడానికి ఒకప్పుడు స్వయంగా పరమశివుడు వ్యాస మహర్షి ని ఆధారంగా తీసుకున్నాడు.

దక్షారామాన్ని “దక్షిణ కాశీ” అని ఎందుకు అంటారు?

క్షేత్రములు అన్నింటిలోకి గొప్పది కాశీ క్షేత్రం దాని కన్నా గొప్పది ఏది అంటే “ద్రాక్షారామ” క్షేత్రం, దీనికి దక్షిణ కాశీ అని పేరు, ద్రాక్షారామ క్షేత్రానికి(Daksaramam Temple) ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మోక్షానికి మోక్షము లభిస్తుంది, అలాగే విశేషమైనటువంటి భోగానికి కూడా అదే క్షేత్రం, అందుకే ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, అర్థ సంబంధమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే దక్షారామ క్షేత్రానికి వెళ్లి భీమనాథుని సేవించండి అంటారు, ఇక్కడ ఉన్న స్వామికి “దక్షారామ భీమేశ్వర స్వామి” అని పేరు, ఈ ఆలయం పంచారామాల్లో, ఒకటిగాను, “త్రిలింగాల్లో” ఒకటిగాను, అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటిగాను విరాజిల్లుతున్నటువంటి క్షేత్రం, ఈ క్షేత్రం కృతయుగం నాటి నుంచి కూడా ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి.

📢 Join Our WhatsApp Channel here:

button

దక్షారామ భీమేశ్వర స్వామి (Daksaramam Temple)మహిమ:

ఆలయం లోనికి వెళ్లేటప్పుడు ఎడమవైపు విగ్నేశ్వరుడు, కుడివైపున స్వామి వారి మూలవిరాట్ ఉంటారు ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది, ఆలయంలో కింద భాగాన్ని చీకటి కోణము అంటారు. ఈ లింగం శుద్ధ స్పటిక లింగం, ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఒక రావి చెట్టు ఉంటుంది, ఆలయ ప్రాంగణంలో మరొక పెద్ద రావి చెట్టు కూడా ఉంటుంది. ఈ ఆలయం పురావస్తు శాఖ మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది.

కాశీ పట్టణంలో ఉన్న విశ్వేశ్వరుడు ఎంత శక్తివంతుడో అంతకన్నా ఎక్కువ అనుగ్రహ శక్తితో “భీమనాయకుడు” ద్రాక్షారామంలో (Daksaramam Temple) ఉన్నాడు, ఆయనని “భీమనాయకుడు “అంటారు, స్వామి పాతాళం నుంచి స్వయంభుగా వెలిసిన లింగం, ఈ స్వామి ఉద్భవించిన తర్వాత “ఓంకార” శబ్దం తో అలా పైకి ఎదుగుతూ ఉన్నారు, ఈ కలియుగంలో ప్రజలు అర్చనకి, అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఉండదని, సూర్యుడు తొలిసారిగా అర్చన చేశాడు, ఆ అర్చనకి స్వామీ సంతోషించి అక్కడితో ఆగిపోయారు, ఈ లింగాన్ని మొట్టమొదటిగా సూర్యుడు పట్టుకోవడం వల్ల దీనిని “భోగలింగం” అంటారు.

భీమనాథుడిని ఒక్కసారి దర్శిస్తేనే జీవితకాలంలో భోగం మోక్షాన్నిప్రసాదిస్తాడు.భీమేశ్వరుని దర్శనం చేసుకోవాలంటే మనం అనుకుంటే జరగదు “సప్తజన్మకృతం పాపం” ఏడు జన్మల పాపాలు పోతే గాని దర్శించుకోలేము,

శక్తిపీఠ మహిమ – మాణిక్యాంబ అమ్మవారు

దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయని దేవి శరీర భాగాలే 18 భాగాలుగా 18 చోట్ల పడ్డాయి అవే శక్తి పీఠాలు, ఈ క్షేత్రం అమ్మవారి నాభి భాగంగా చెప్తారు, ఈ నాభిని సంస్కృతంలో మణిపూర్వక చక్రం అంటారు కాబట్టి “మాణిక్యంబ”. ఏ దేవాలయంలో ఆయన శ్రీ చక్ర యంత్రం అమ్మవారి ముందు గాని, పక్కన గాని పెట్టి, శ్రీ చక్రయంత్రంకే అర్చన జరుగుతూ, అమ్మవారికి అలంకారం మాత్రమే జరుగుతుంది, కానీ ఈ ద్రాక్షారామ క్షేత్రంలో అమ్మవారు శ్రీ చక్రం మెరువు మీద నిలబడటం వల్ల ఆ యంత్రం మెరువు భాగంతో కలిపి అమ్మవారికి పూజ జరుగుతుంది.

అమ్మవారి దృష్టి ఆగ్నేయ దిశలో ఉండటానికి కారణం

అలాగే ఇక్కడ అమ్మవారు చూపు ఓరగా ఆగ్నేయ ముఖంగా చూస్తుంది, ఈ శ్రీ చక్రం మీద ఉండటం వల్ల ఉగ్రం పెరిగి వచ్చే భక్తులు నరబలులను, రక్తాభిషేకం అడుగుతున్నారని జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు అద్వైత మతాన్ని స్థాపించాక, దేశసంచారం చేసే సమయంలో ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు, అమ్మవారి చూపులు సామాన్య మానవులు తట్టుకోలేరని గమనించి, ఆగ్నేయ ముఖంగా ఉన్నటువంటి అగ్ని ఆవిడ ఉగ్రాన్ని తట్టుకోగలరని ఆవిడ చూపుని ఆగ్నేయ ముఖంగా మార్చారు అని కూడా చెప్తారు. అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు “అంబాత్రయం”.

అంబాత్రయం – మూడు మహా శక్తులు

  • కాళహస్తి “జ్ఞాన ప్రసూనాంబ”,
  • శ్రీశైలం “భ్రమరాంబ”,
  • ద్రాక్షారామం “మాణిక్యాంబ” ,

ఈ మూడిటినీ కలిపి “అంబాత్రయం” అంటారు.

Daksaramam Temple
daksharamam temple

దక్షారామం ఆలయ (Daksaramam Temple) నిర్మాణం & ప్రత్యేకతలు:

  • ఆలయం రెండు అంతస్తుల నిర్మాణం

  • ప్రవేశం వద్ద ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపున మూలవిరాట్

  • ఆలయ ప్రాంగణంలో రెండు పెద్ద రావిచెట్లు

  • కింద భాగాన్ని చీకటి కోణం అంటారు

  • పురావస్తు శాఖ & దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ

ఈ క్షేత్రంలో విశేషంగా ఉత్సవాలు జరిగే సమయాలు:

  • చైత్రమాసంలో వసంతోత్సవాలు,
  • వైశాఖ శుద్ధ పంచమి రోజు అంటే ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా జరుగుతాయి,
  • అలాగే శ్రావణమాసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు,
  • భాద్రపద మాసంలో స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి దుండి గణపతి స్వామి వారికి గణపతి నవరాత్రి ఉత్సవములు,
  • ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవములు
  • కార్తీక మాసం స్వామి వారికి విశేష ఉత్సవములు జరుగుతాయి.
  • ప్రపంచంలో ఎక్కడా ఏ దేవాలయంలో గాని, ఏ క్షేత్రంలో గాని లేనటువంటిది ఈ స్వామి వారి జన్మదిన మహోత్సవం, ఇక్కడ మార్గశిర శుక్ల చతుర్దశి దీన్నే పాషాణ చతుర్దశి అంటారు, ఆ రోజే స్వామివారు ఉద్భవించినట్టు మనకి శాసనాలు ఉన్నాయి, దాని ఆధారంగా ఆ రోజు స్వామివారికి జన్మదిన మహోత్సవం కూడా చాలా వైభవంగా జరుగుతుంది
  • మాఘమాసంలో స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం అవి కూడా ఏడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.
  • మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శనం చేసుకుంటే భక్తులకి విశేషమైనటువంటి ఫలితం, బాధలు తొలగిపోతాయని అని కూడా శాస్త్రాలలో చెప్పబడ్డాయి, అలాగే ఇక్కడ వేములవాడలోని భీమకవి కూడా స్వామివారి వరప్రసాదంగా జన్మించారని చెప్తారు.
  • ఈ గుడిలో ప్రాత: కాలం 5 గంటలకి ప్రారంభమైన స్వామివారి అర్చన, పూజా కార్యక్రమాలు రాత్రి 8 గంటల వరకు కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి, ఇందులో ప్రత్యేకంగా ఆలయంలో జరిగే ప్రథమాభిషేక సేవ ఉదయకాలం 6:00 స్వామివారి మూలవిరాట్ కి స్వచ్ఛమైన ఆవుపాలతో, గోశాల నుంచి వచ్చిన స్వదేశీ ఆవుపాలతో స్వామివారికి విశేషంగా అర్చక స్వాములచేత, ఆలయ పండితుల చేత ప్రధమాభిషేకం, భక్తజన సందోహంతోటి విశేషంగా జరుగుతుంది, గోశాల నుంచి వచ్చిన పాలతో తోడిపెట్టిన పెరుగు నివేదనగా సమర్పిస్తారు, భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చు.
  • అదేవిధంగా కలియుగంలో చండీ, వినాయకుడిని మించిన ఆరాధన లేదు, ఈ దివ్య క్షేత్రంలో ప్రతిరోజు కూడా శక్తి పీఠంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ఆలయంలో దేవస్థానం పండితుల చేత చండీ హోమం జరుగుతుంది, భక్తులు పాల్గొనే విధంగా సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి శుక్రవారం 10 గంటలకు రాహుకాల సమయంలో అమ్మవారి సన్నిధానంలో కుంకుమార్చన జరుగుతుంది.

దక్షారామము క్షేత్రంలో జరిగిన యదార్థ సంఘటన

Google Maps Location:

ముగింపు:

ఆధ్యాత్మికత, చరిత్ర మరియు అద్భుత శిల్పకళల అరుదైన సంగమం ఈ Daksaramam Temple. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా, పంచారామ క్షేత్రాలలో ప్రధానమైనదిగా వెలుగొందుతున్న ఈ పుణ్యధామం ప్రతి భక్తుడిని భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఇక్కడి పవిత్ర సప్త గోదావరి తీర్థం మరియు భీమేశ్వర స్వామి దర్శనం జన్మధన్యమని భక్తుల నమ్మకం. మీరు మానసిక ప్రశాంతత కోసం లేదా మన సంస్కృతిని తెలుసుకోవడం కోసం వెతుకుతున్నట్లయితే, మీ తదుపరి పర్యటనలో తప్పకుండా ఈ Daksaramam Temple ను దర్శించండి.

“మీరు ఎప్పుడైనా ద్రాక్షారామాన్ని సందర్శించారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్‌లో మాతో పంచుకోండి!”

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button


Spread the love

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *