Mopidevi Temple History, Timings & Pooja Details | మోపిదేవి ఆలయ చరిత్ర మరియు సమయాలు
ఈ రోజు మనం Mopidevi Temple Secrets & Timings గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శివుడు మరియు సుబ్రహ్మణ్యుడు కలిసి కొలువుతీరిన క్షేత్రం “మోపిదేవి” సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్ప రూపంలో వెలిశాడు “సుబ్రహ్మణ్యుడు”. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న దేవాలయం, ఆంధ్రప్రదేశ్, కృష్ణాజిల్లా, చల్లపల్లి మండలం మోపిదేవి లో ఉంది. ఈ దేవాలయం “విజయవాడ” నుండి 70 కిలోమీటర్ల దూరంలో “మచిలీపట్నం” నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. “మోహినిపురక్షేత్రం” కాలానుక్రమంగా “మోపిదేవి”గా మార్పు చెందింది.

📢 Join Our WhatsApp Channel here:
Mopidevi Temple History & Significance (మోపిదేవి ఆలయ చరిత్ర)
ఒకసారి సనకస నందులు శివుని దర్శనం కోసం కైలాసం చేరుకున్నారు అదే సమయంలో సచి మరియు స్వాహా కొందరు దేవతా మూర్తులు పార్వతి దేవిని కలిసేందుకు వచ్చారు. వారిని చూసిన సుబ్రమణ్యేశ్వరుడు నవ్వడం మొదలు పెట్టాడు, అది గమనించిన తల్లి మందలించడం వల్ల సుబ్రహ్మణ్యుడు పార్వతి దేవిని క్షమాపణ అడిగి తపస్సు కోసం ఈ స్థలానికి వచ్చారు. అదే సమయంలో అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వదిలి దక్షిణ భారత దేశాన్ని పర్యటించారు. మార్గ మధ్యలో శిష్యులతో కలిసి కృష్ణా నదీ తీరంలో మోహిని పురంలో సేద తీరుతుండగా జాతి వైరాన్ని మరిచి పాము ముంగిస నెమలి ఆడుకుంటూ కనిపించాయి.
ఆ పక్కనే దివ్య తేజస్సుని విరజిమ్ముతూ ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరికి వెళ్లి చూడగా కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేస్తూ కనిపించాడు. దివ్య దృష్టితో గమనించిన అగస్త్య మహర్షి పుట్ట పైన శివ లింగాన్ని ప్రతిష్టించారు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి తాను పుట్టలో ఉన్నానని ఆలయాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. స్వామి అభీష్టాన్ని అనుసరించి పెద్దలు ఆలయ నిర్మాణాన్ని చేసారు.
ఇక్కడ సుబ్రహ్మణ్యుడు చేతిలో ఆయుధాన్ని పట్టుకున్న బాలుడు రూపంలో కాకుండా తండ్రి శివుని మాదిరిగా లింగ రూపంలో ధన్యుల్ని చేస్తారు. ఇక్కడ శివ లింగానికి ఉన్నట్టు పానవట్టం ఉండదు దానికి బదులు ఒక పాము చుట్టలు చుట్టుకొని ఉన్నట్టుగా క్రింది భాగం ఉంటుంది. దాని పైన లింగాకారంలో స్కందుడు కొలువై ఉంటాడు.
కలియుగంలో మోహిని పురం(మోపిదేవి) అనే దివ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి “సర్పరూప” దారియై తపస్సు చేసుకుంటారు అని స్కాంద పురాణం చెప్తుంది. స్వామి సాక్షి భూతంగా ఉన్నటువంటి క్షేత్రం ఇది. శివుడు, సుబ్రహ్మణ్యుడు ఇద్దరూ ఒకే చోట కొలువుతీరిన క్షేత్రం. ఈ క్షేత్రానికి ఐదవ శతాబ్దాల పురాణ చరిత్ర ఉంది. దీనిని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు పురాణాలలో చెబుతారు. సుబ్రహ్మణ్య దేవాలయ అభివృద్ధి అంతా కూడా చల్లపల్లి వంశీయులైనటువంటి జమీందారు గారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా చరిత్ర చూస్తూ ఉంటాం.
స్వామి భక్తులను అనుగ్రహించడానికి కలియుగ ప్రారంభంలో అగస్త్య మహాముని దర్శనం తర్వాత వాల్మీకం(పుట్ట)లో నుంచి లింగ రూపంలో ఉద్భవించారు. మనకి గర్భగుడిలో కనిపించేది లింగం, అంతర్గతంగా ఉండేది “పుట్ట(వాల్మీకం)”. వాల్మీకంలో స్వామి సర్పరూప దారియై తపస్సు చేసుకుంటారని స్కాంద పురాణం చెప్తుంది. ఈ లింగం శ్రీశైల లింగాన్ని పోలి ఉంటుంది. ఒక మూర్తిని ఇంకో రూపంలో దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యం.
ఇక్కడ స్వామి స్వయంభుగా వెలిశాడు, ఇక్కడ మూర్తి “లింగ” రూపంలో ఉంటుంది, పానమట్టం (పానవట్టం లేదా జలహరి) కింద ఒక రంద్రం ఉంటుంది. ఆ రంద్రం నుంచి సంవత్సరంలో ఒకటి లేదా రెండుసార్లు స్వామి సర్ప రూపంలో (నాగుపాము) బయటకు వచ్చి భక్తులకు దర్శనం ఇస్తుంటారని చెప్తారు. ఈ రంధ్రంలో అభిషేకం, అర్చన సమయాలలో పాలు పోస్తారు. గర్భాలయానికి దక్షిణం వైపు “నాగ పుట్ట” ఉంటుంది. గర్భాలయ శివలింగ పానమట్టం కింద నుంచి పుట్టకి దారి ఉందని చెప్తూ ఉంటారు.
మీరు ఎప్పుడైనా మోపిదేవి ఆలయాన్ని దర్శించారా? మీ అనుభవాన్ని క్రింద కామెంట్స్‌లో తెలియజేయండి
సంతానం, వివాహం కావాలని అనుకున్న వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుంది అని భక్తుల విశేష నమ్మకం:
వివాహం ఆలస్యం, సంతానం లేకుండుట, శత్రుభయాలు, వ్యాపార అభివృద్ధి లేని వారు ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల పరిష్కారం దొరుకుతుంది. ఈ దేవాలయంలో నిత్యకళ్యాణాలు జరుగుతాయి, వివాహం కాని వారు ఈ కళ్యాణంలో పాల్గొంటారు. ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ సంతానం కోసం పూజ చేసి సంతానం కలిగిన తర్వాత పిల్లలకి, కేశఖండన, నామకరణం, అన్నప్రాసన, చెవి పోగులు కుట్టించడం, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు.
అంతేకాకుండా మనం పుట్టమన్నుని ధరిస్తే వ్యాధులు దరి చేరవని చెప్తారు. ఈ ఆలయంలో చాలామంది నిద్ర చేస్తుంటారు. అంతేకాకుండా ఎటువంటి కోరిక అయినా తీరుతుంది అని భక్తుల విశ్వాసం. రాత్రి 8 గంటల నుంచి ఆలయంలో నిద్రించడానికి అనుమతిస్తారు. దేవాలయ ప్రాంగణంలో దీపాలు పెట్టడానికి ప్రత్యేక మండపం ఉంటుంది. దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి రోజు ఈ దేవాలయం చాలా రద్దీగా ఉంటుంది. ఆదివారాలు, మంగళవారాలు, గురువారాలు, ఆషాడ శుక్లపంచమి, నాగపంచమి, నాగులచవితి, సుబ్రహ్మణ్య షష్టి రోజులు సుబ్రహ్మణ్యేశ్వరుని విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. భక్తులు పర్వదినాల్లో ఎక్కువ విచ్చేస్తుంటారు. అలాగే నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్టి, కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో దర్శనం పొందుతారు.
దీపావళి అమావాస్య స్నానం విశిష్టత గురించి ఇక్కడ చదవండి
Mopidevi Temple Sarpadosha Pooja Details (మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సర్పదోష నివారణ పూజ):

సర్పదోష నివారణకు కూడా ఈ దేవాలయంలో స్వామిని దర్శిస్తారు. దృష్టి, వినికిడి, సంతానం, వివాహం ఆలస్యం, అనారోగ్యం, వంటి సమస్యలతో బాధపడే వారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే దోష నివారణ అవుతుంది. ఇక్కడ రాహు కేతువుల పూజ కూడా చేస్తారు, సంతానం కోసం పూజ చేసేవారు ఇక్కడ ఉన్న నాగవల్లి వృక్షానికి ఉయ్యాల కడతారు, ఆలయంలో ముడుపు కడితే ఎటువంటి సమస్య అయినా తీరుతుంది. ఈ ఆలయంలో కాలసర్ప దోష పూజలు కూడా చేస్తారు. ముడుపుకి కావాల్సిన వస్తువులు ఈ దేవాలయం బయట షాపుల్లో లభిస్తాయి.
దేవాలయంలో జరిగే పూజా విశేషాలు ఏమిటి?
ఈ దేవాలయంలో ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు రుద్రాభిషేకం(బ్యాచెస్ వైస్ రుద్రాభిషేకం నిర్వహిస్తారు)జరుగుతుంది.
- సర్ప దోష నివారణ పూజలు,
- రాహు కేతువుల పూజ,
- నిత్యకళ్యాణములు, మాఘమాసంలో స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెప్పోత్సవం కూడా చేస్తారు.
Mopidevi Temple Timings & Darshan Schedule (మోపిదేవి ఆలయ దర్శన సమయాలు):
| సేవ / సమయం | సమయ వివరాలు |
|---|---|
| సుప్రభాత సేవ | ప్రతిరోజూ ఉదయం 5:00 గంటలకు |
| ఉదయం దర్శన సమయాలు | 5:00 AM నుండి 1:00 PM వరకు |
| విరామ సమయం (మధ్యాహ్నం) | 1:00 PM నుండి 4:00 PM వరకు |
| సాయంత్రం దర్శన సమయాలు | 4:00 PM నుండి 8:00 PM వరకు |
సుబ్రహ్మణ్యేశ్వరుడికి పాయసాన్నం నైవేద్యం ఎందుకు పెడతారు?
సుబ్రహ్మణ్యేశ్వరుడికి సుప్రభాతంలో చెబుతూ ఉంటాం, స్వామి వారు పాయసాన్నం ప్రియుడు, పాయసాన్ని పొంగలిగా నివేదన చేస్తూ ఉంటారు, భక్తులందరూ పుట్టలో వాళ్ళంతట వాళ్లే నివేదన చేసే భాగ్యాన్ని దేవాలయం వారు కల్పించారు కాబట్టి పొంగలిని తీసుకెళ్లి పుట్టలో నివేదన చేస్తారు.
మనిషి జీవితం సర్పరూపాన్ని పోలి ఉంటుంది:
“సుబ్రహ్మణ్యేశ్వరుడు మంగళకరుడు”. మనకి జరిగే సమస్త సన్మంగళాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క దివ్యమైన అనుగ్రహం. మన యొక్క రూపం కూడా సుబ్రహ్మణ్య రూపమే, సర్ప రూపంలోనే మనిషి జీవితం మొదలవుతుంది, వెనుకాల ఉన్న వెన్నుపాము సర్పరూపంలో ఉంటుంది. మనిషికి షడ్చక్రాలు ఉంటాయి అని చెప్తారు, మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న షడ్చక్రాల్లో శక్తి అంతా సర్ప రూపంలోనే ప్రవహిస్తూ ఉంటుంది.
మూలాధార చక్రంలో మనిషికి కావలసినటువంటి శక్తి అంతా సర్పరూపంలో ఉంటుంది. అది సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క శక్తి స్వరూపం అని భావించవచ్చు. కలియుగంలో సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిష్టాన దైవం. కుజుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడే సంతోషాలు ఉంటాయి, ఆనందాలు కలుగుతాయి, ఇంట్లో మంగళతోరణాలు కట్టుకునేటటువంటి శుభ సందర్భాలు అన్ని, ఆరోగ్యంగాను, ఆర్థికంగానూ ఉండే సందర్భాలు అన్నిటికీ కూడా కుజుడు యొక్క దివ్య అనుగ్రహం అవసరం.
అటువంటి కుజుడికి అధిష్టాన దైవం అయినటువంటి సుబ్రహ్మణ్యస్వామిని భక్తితో, శరణాగతితో, ఆర్తితో, త్రికరణ శుద్ధిగా, మనసు, బుద్ధి, కర్మ అన్ని పరమేశ్వర పాదార్పణంగా స్వామిని వేడుకోవడం ద్వారా స్వామి దివ్య అనుగ్రహాన్ని వేలాదిగా లక్షలాదిగా పొంది పునర్ దర్శనం మళ్ళీ మళ్ళీ ఈ దేవాలయంలో పొందుతూ ఉన్నారు భక్తులు.
ఇంట్లో మంగళ తోరణాలు కట్టే సందర్భాలు ఎలా వస్తాయి?
ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళింట్లో శుభకార్యాలు, శుభపరంపర జరగాలని కోరికతో వస్తారు. ఆ ఇంట్లో మంగళ తోరణాలు కట్టే సందర్భాలు సుబ్రమణ్యుడి అనుగ్రహంతో వస్తాయి. వివాహాలు కావచ్చు, సంతానం కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, భూ సంబంధమైన లావాదేవీలు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం వల్ల దివ్యంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడు విద్యాప్రదాత కూడా ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా నిర్వహిస్తారు.
Mopidevi Temple Specialities & Secrets (ఆలయ ప్రత్యేకతలు – మీరు తెలుసుకోవలసిన రహస్యాలు):
స్వయంభూ లింగం: ఇక్కడ స్వామివారు లింగ రూపంలో ఉంటారు, కానీ పీఠం పాము చుట్టల ఆకారంలో ఉంటుంది.
ప్రసాదం: ఇక్కడ ఇచ్చే విభూతి అత్యంత శక్తివంతమైనది.
నిద్ర చేయడం: కోరికలు తీరాలని భక్తులు ఆలయ ప్రాంగణంలో రాత్రిపూట నిద్ర చేస్తారు (రాత్రి 8 గంటల తర్వాత అనుమతిస్తారు).
“సుబ్రహ్మణ్య విభూది అత్యంత శ్రేష్టమైనది అత్యంత శక్తివంతమైనది”. సుబ్రహ్మణ్యుడిని మనం శక్తి స్వరూపంగా భావన చేస్తూ ఉంటాం, ఆయన “దేవసేనపతి”, ఆయన విభూతి అంటేనే ఐశ్వర్యం, అంటే ఐశ్వర్యాన్ని ముఖాన ధరిస్తున్నాం అని అర్థం. విభూది పెట్టుకోవడంలో లక్ష్యం ఏమిటంటే మనం విభూదిని నుదుట మీద పెట్టుకుంటాం, ఆ నుదుటి వెనక హైపోథాలమస్ ఉంటుంది శరీరంలో ఉన్న అన్ని గ్లాండ్స్ ని ఆ పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది, కాబట్టి శరీరం యొక్క అన్ని గ్రంధులు సమంగా పనిచేయడం ద్వారా మానసికమైనటువంటి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు మనిషి.
మనిషిని హిందువుగా ఎప్పుడు గుర్తిస్తాం?
మనిషిని హిందువుగా ఎప్పుడు గుర్తిస్తాం అంటే ముఖాన విభూతో లేక తిలకం ఉంటే గుర్తిస్తాం, విభూది, తిలకం అనేది హిందూ మతానికి సంకేతం. కానీ సుబ్రహ్మణ్యుడి విభూది ధరించడం ద్వారా చాలా రకాలైన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి, అపమృత్యు దోషం తొలగిపోతుంది. సుబ్రహ్మణ్యం విభూది మహాప్రసాదం.
How to Reach Mopidevi Temple: Location & Route (మోపిదేవి ఆలయానికి ఎలా చేరుకోవడం?):
- విజయవాడ, అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల నుండి నేరుగా బస్సులు.
- రేపల్లె రైల్వే స్టేషన్ నుండి 15 కి.మీ దూరంలో టాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి.
- గన్నవరం(విజయవాడ) విమానాశ్రయం దగ్గరలో ఉంటుంది.
ముగింపు:
సర్ప దోష నివారణకు మరియు కోరిన కోర్కెలు తీర్చే శక్తివంతమైన క్షేత్రంగా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ వ్యాసంలో మనం Mopidevi Temple Secrets & Timings మరియు పూజా వివరాలను సమగ్రంగా తెలుసుకున్నాము. మీరు కూడా ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి, స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః!
For more information:
Visit Sri Subramanyeswara Swamy Temple Mopidevi Official Website for more details.
Google Maps Location:
మరిన్ని ప్రముఖ ఆలయాల గురించి ఇక్కడ చదవండి:
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:








