2026 దీపావళి అమావాస్య స్నానం చేస్తే కలిగే అద్భుతమైన ఫలితాలు ఇవే! Deepavali Amavasya Snanam|
దీపావళి అంటే కేవలం టపాకాయలు, వెలుగుల పండుగ మాత్రమే కాదు, దీని వెనుక ఎంతో ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. ఆశ్విజ మాసం చివర వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్యగా పిలుస్తారు. ఈ పవిత్ర రోజున ఆచరించే దీపావళి అమావాస్య స్నానం (Deepavali Amavasya Snanam) అత్యంత విశిష్టమైనది. శాస్త్రాల ప్రకారం, ఈ రోజున ప్రతి నీటి బొట్టులో గంగాదేవి ఆవాహనమై ఉంటుందని, అందుకే ఈ స్నానం వల్ల గంగానదిలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ ఆర్టికల్‌లో Deepavali Amavasya Snanam ప్రాముఖ్యత, తైలాభ్యంగం మరియు గంగా ఆవాహన విధానం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
📢 Join Our WhatsApp Channel here:
దీపావళి అంటే దీపముల వరస. ఆశ్విజ మాసం చివర వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున చేసే దీపావళి అమావాస్య స్నానం అత్యంత మైనది. సాధారణ రోజుల్లో మనం స్నానం చేసే సమయంలో “గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి…” అని గంగా ఆవాహన చేస్తాం.
కానీ దీపావళి అమావాస్య రోజున మాత్రం ఎక్కడ నీరు ఉన్నా ఆ నీటిలో గంగాదేవి స్వయంగా ఆవాహన అవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదే ఈ స్నానానికి ఉన్న మహిమ.
తైలాభ్యంగం ప్రాముఖ్యత:
“తైలే లక్ష్మి జలే గంగా
దీపావళీ దినోదవేత్
అలక్ష్మీ పరిహారార్థం
తైలాభ్యంగం విధీయతే”
ఈ శ్లోకం ప్రకారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి దీపావళి అమావాస్య రోజున ప్రవేశిస్తారు.
అందుకే ఈ రోజున నువ్వుల నూనెతో తైలాభ్యంగం చేసి తెల్లవారుజామున స్నానం చేయాలి. తలతో సహా శరీరం పూర్తిగా తడవాలి. ఈ స్నానం ద్వారా నూనె స్పర్శతో అలక్ష్మి నివారణ, గంగా స్నానంతో పాప పరిహారం సాధ్యమవుతాయి.
గంగా ఆవాహన విధానం – దీపావళి అమావాస్య ప్రత్యేకత | Deepavali Amavasya Snanam Importance

ఇతర రోజుల్లో నదీ స్నానం అవసరం కానీ, దీపావళి అమావాస్యనాడు గంగాదేవి ప్రతి నీటిలో ఆవాహన అవుతుంది. అందుకే ఇంట్లోనే స్నానం చేసినా గంగా స్నాన ఫలం లభిస్తుంది. ఈ రోజు తైలాభ్యంగ స్నానం చేయాలని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.
అలక్ష్మి నివారణ & లక్ష్మీ ఆవాహన యొక్క ఆధ్యాత్మిక అర్థం:
దీపావళి రోజున దీపములు వెలిగించడం ద్వారా అలక్ష్మిని తొలగించి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. బాణసంచా కాల్చడానికీ ఇదే అసలైన అర్థం.
అలక్ష్మి పరిహారార్థం:
ఇంటిని శుభ్రం చేసి, దీపముల వరస పెట్టి, లక్ష్మీ పూజ చేయడం ద్వారా అంతరంగ శుద్ధి, బాహ్యంగా ఐశ్వర్య అనుగ్రహం లభిస్తాయి.
ప్రకృతి స్వరూపిణి లక్ష్మీదేవి ఆవాహన: ఉత్తరేణి చెట్టు స్నానము మరియు అపమృత్యు నివారణ:
అమ్మవారు ఒక్కొక్క కాలం నందు ఒక్కొక్క చెట్టులోకి ప్రవేశిస్తుంది, ఎందుకంటే లక్ష్మీ అష్టోత్తరానికి ప్రారంభమే ప్రకృతిం వికృతిం విద్యామని కదా, ఆవిడ పేరు ప్రకృతి, ప్రకృతి స్వరూపిణి. మనకి ఉపద్రవం ప్రకృతిలో నుంచి వస్తుంది, మనకు రక్షణ ప్రకృతిలో నుంచే వస్తుంది. అందుకే వసంతఋతువు ప్రారంభంలో వేపపువ్వు రూపంలో ఉండి రక్షిస్తుంది, అందుకని వేప పువ్వుతో కూడిన ప్రసాదం తింటాం.
శారదా నవరాత్రులు లేదా దేవీ నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికి, దీపావళి అమావాస్యనాడు అపమృత్యు భయం లేకుండా ఉండడానికి, ప్రమాదాలు జరిగి శరీరం పడిపోకుండా ఉండడం కోసమని, మట్టి పెళ్ళలతో కూడిన ఉత్తరేణి చెట్టు తీసుకువచ్చి ఇంట్లో పెట్టి స్నానం చేస్తారు.
శారద నవరాత్రులు లేదా దేవి నవరాత్రులు గురించి ఇక్కడ చదవండి
దీపావళి అమావాస్య స్నానం (Deepavali Amavasya Snanam) చేసేటప్పుడు సంకల్పం చెప్పి తల మీద నుంచి నీళ్లు పోసుకుని తైలాభ్యంగానం, చేసి ఆ తర్వాత ఉత్తరేణి చెట్టు చేత్తో పట్టుకుని ఆ మట్టి మీద పడేటట్టుగా తిప్పుకోవాలి, తిప్పుకుంటూ ఒక శ్లోకాన్ని మంత్ర రూపంలో చెప్తారు. మంత్ర రూపంలో చెప్తే కొంతమందికే అధికారం వస్తుంది. శ్లోక రూపంలో చెప్తే అందరూ దాన్ని అనుసంధానం చేసుకోవచ్చు, అందుకని ఒక శ్లోక రూపంలో అందించారు మహర్షులు.
సీతలోష్ట సమాయుక్త సంఖంటక మలాద్విత హర పాప అపామార్గ బ్రామ్యమాణ పున పునః
ఓ ఉత్తరేణి చెట్టు నా పాపాలను నశింప చేసి నాకు అప మృత్యువు రాకుండా అని ఆ మట్టి పెళ్ళలతో ఉన్న ఉత్తరేణి చెట్టు చుట్టూ తిప్పుకొని పక్కన పడేస్తారు, పడేసి స్నానం చేసి ఆ తర్వాత ఉత్తరేణి చెట్టుని తీసుకెళ్లి బయట ఎక్కడో వీధిలో పడేయాలి.
నరకాసురుడు చనిపోతే దీపాలు ఎందుకు వెలిగించాలి? దీపావళి అమావాస్య రోజే ఎందుకు మరణించాడు?
నిజంగా నరకాసుడు అనేవాడు మన మనసులోనే ఉంటాడు, నరకాసురుడు ఆదివారాహమూర్తికి, భూదేవికి కలిసి జన్మించాడు. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగ ఫలితమే నరకాసురుడు. మొట్టమొదట ప్రాక్జ్యోతిష పురంలో ఉన్నాడు, నరకాసురుడు తల్లి భూదేవి, మనందరికీ కూడా తల్లి భూదేవి ఎందుకంటే, పోషణ ఎవరు చేస్తారో వారిని తల్లి అని పిలుస్తారు. ప్రాక్ అంటే పూర్వకాలమునందు లేదా మొదటినుంచి ఎప్పుడూ ఉన్నది అని అర్ధం.
జ్యోతిష్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మవస్తువుని తెలుసుకోవడానికి ఇందులోకి(మానవ జన్మ) వచ్చాము, ఇందులో ఉండి ఈశ్వరుడు యొక్క అనుగ్రహం పొందడానికి వచ్చాము, మానవ జన్మలోకి రాగానే నరకాసురుడు “ప్రాక్ జ్యోతిష” పురానికి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు, నరకాసురుడు మొట్టమొదట నాకు తల్లి ఎవరో తెలియదు అని అన్నాడు, మహిషాపురంలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడు, మహిష ప్రవృత్తి అంటే దున్నపోతు యొక్క లక్షణం.
నరకాసురుడుకి మహిష ప్రవృత్తి ముగ్గురి వల్ల వచ్చింది. మురాసురుడు, విశంబుడు, హైగ్రీవుడు అనే ముగ్గురు స్నేహితులు. సత్వ, రజో, తమో గుణములు అనేటటువంటి మూడు గుణములతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు ఈ గుణములలోనే తిరుగుతూ ఉన్నాడు.
నరకాసురుడు ఎవరి కోసం తపస్సు చేశాడు? ఆయన పొందిన వరం ఏమిటి?
నరకాసురుడు చతుర్ముఖ బ్రహ్మ గురించి తపస్సు చేసి, బ్రహ్మగారు నీకు ఏం కావాలి అంటే, మరణం ఉండకూడదు అన్నాడు, అలా కుదరదు ఇంకొకటి అడుగు అన్నాడు చతుర్ముఖ బ్రహ్మ గారు. బ్రహ్మగారు అప్పుడు అన్నారు అమ్మ చేతిలో చనిపోతానని భయం లేదుగా, అమ్మ చేతిలో చనిపోతావని వరం ఇస్తాను తీసుకుంటావా అన్నాడు, అమ్మకి పెంచడం తప్ప చంపడం తెలియదు కాబట్టి చావు లేదని సరే అన్నాడు నరకాసురుడు. కాబట్టి నువ్వు మీ అమ్మ చేతిలో చనిపోతావు అని వరం ఇస్తారు చతుర్ముఖ బ్రహ్మ గారు.
నరకాసురుడు అమ్మ చేతిలో చనిపోతాడు కాబట్టి, తన తల్లి ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు మాహిష్మతి పురంలో కానీ తెలుసుకోలేకపోయాడు, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాడు. ఫ్రాక్జ్యోతిష పురం లో ఉంటే తెలిసేది. అజ్ఞానంలో ఉండి తెలుసుకోలేక “అతిథి కుండాలములను అపహరించాడు”.
దీపావళి అమావాస్య స్నానం (Deepavali Amavasya Snanam) వల్ల లభించే ఫలితాలు:
అలక్ష్మి నివారణ
పాప పరిహారం
లక్ష్మీ ఆవాహన
అపమృత్యు భయ నివృత్తి
ఆధ్యాత్మిక శుద్ధి

ముగింపు: దీపావళి అమావాస్య స్నాన ఫలితం (Deepavali Amavasya Snanam Benefits)
చివరగా, దీపావళి అమావాస్య స్నానం (Deepavali Amavasya Snanam) అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన శరీరానికి మరియు ఆత్మకు చేసే ఒక శుద్ధి ప్రక్రియ. శాస్త్రోక్తంగా తైలాభ్యంగ స్నానం ఆచరించడం ద్వారా అలక్ష్మి ప్రభావం తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున గంగాదేవి ప్రతి నీటి బొట్టులోనూ కొలువై ఉంటుందని మర్చిపోకండి. మీరు కూడా పైన చెప్పిన గంగా ఆవాహన విధానాన్ని అనుసరించి, ఈ Deepavali Amavasya Snanam ద్వారా సకల పాపాలను తొలగించుకుని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము.
హిందూ ధర్మం ప్రకారం పండుగలు మరియు విశిష్టమైన మరిన్ని ఆధ్యాత్మిక వివరాలను మీరు TTD అధికారిక వెబ్‌సైట్ నందు కూడా తెలుసుకోవచ్చు.
మోపిదేవిలో సర్పదోష పూజ గురించి ఇక్కడ చదవండి
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:








