దేవి నవరాత్రులు (Significance of Devi Navratri ) లేదా Sharada Navaratri అని ఎందుకు అంటారు?
దేవి నవరాత్రుల ప్రాముఖ్యత (Significance of Devi Navratri)
దేవీ నవరాత్రులు అన్న పేరుతో తొమ్మిది రోజులు నిర్వహించాలి ఆ తర్వాత విజయదశమి పర్వదినం వస్తుందని ఋషులు నిర్ణయించారు. ఋషులు ఏది నిర్ణయం చేసినా తగిన ప్రాతిపదిక లేకుండా చేయరు, వారు కాలవిభాగం చేయడంలో, కాలం నందు అంతర్లీనంగా ఉండేటటువంటి భగవత్ శక్తిని లెక్క కట్టడంలో అందవేసినటువంటి సిద్ధహస్తులు. అందుకే ఋషులు శారదా నవరాత్రులను నిర్ణయం చేశారు.
శరత్ కాలము అంటే తెల్లటి మబ్బులు కనబడతాయి, చంద్రబింబం వెన్నెల కురిపిస్తుంది, మిగిలిన పౌర్ణమి రోజులు కన్నా శరత్ కాలంలో చంద్రుడు ఎక్కువ కాంతివంతంగా ఉంటుంది, శరత్ కాలం తెలుపుతో సంబంధాన్ని కలిగి ఉంటుంది, మనిషి జీవితానికి పరమ ప్రయోజనం, జ్ఞానం పొందడం. ఆ జ్ఞానాన్ని తెలుపు రంగుతో సూచిస్తారు, తెల్లటి బట్టకట్టుకొని, తెల్లటి కాంతులతో తెల్లటి పద్మంలో కూర్చుని శాంతికి, జ్ఞానానికి, పవిత్రతకు పర్యాయపదం అయినటువంటి తెలుపుతనానికి మారుపేరుగా “శారద” శోభిస్తూ ఉంటుంది.
📢 Join Our WhatsApp Channel here:
శంకరుడు కూడా తెల్లటి రంగు పొంది ఉంటాడు, తన చుట్టూ ఉన్న వారిని ప్రశాంతంగా ఉంచడం, తాను పవిత్రంగా ఉండడం, ఇది తెలుపు వర్ణం చేత సంకేతించబడుతుంది. అటువంటి మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానమును ఆవిష్కరించేటటువంటి ఋతువు గనుక, వీటికి శరదృతువు అన్న పేరు అన్వయం అయ్యాయి. ఇందులో శారదా నవరాతలు మొట్టమొదట ప్రారంభం అయ్యేటటువంటి తొమ్మిది తిధులు ఆశ్వీజ మాసం ప్రారంభంలో పౌర్ణమి మొదలుకొని నవమి వరకు ఏమి ఉన్నాయో వీటిని శరన్నవరాత్రులు అన్న పేరుతో అనుష్టానం చేయండి అని ఋషులు చెప్పారు.
శారదా నవరాత్రులు ఎందుకు ముఖ్యమైనవి?
శారదా నవరాత్రులు సద్వినియోగం చేసుకోవాలి. శారదా నవరాత్రులు వసంత నవరాత్రులు ప్రారంభ కాలంలో యమ ధర్మరాజు యొక్క 2 కోరలు (1 కోర శరత్ కాలమందు, 1 కోర వసంత కాలమందు) పైకి వస్తుంది, అంటు వ్యాధులు వచ్చేఅవకాశాలు బాగా ఉంటాయి. శ్రావణ, భాద్రపద మాసాలు వర్షఋతువులు, కొత్తగా పడినటువంటి వర్షం నీరు మలినమవుతుంది, ఆ నీరు త్రాగినటువంటి జీవుల యందు అంటువ్యాధులు వస్తాయి, ఆ వ్యాధి వల్ల దీపపు పురుగులు పడినట్లుగా జీవులు పడిపోతారు, అలా పడిపోకుండా ఉండడానికి గణపతి నవరాత్రులలో ఓషధీతత్వం కలిగినటువంటి పత్రిలతో ఆరాధన చేయించి, ఈ 15 రోజుల ముందే ఈ విఘ్నేశ్వరుని పూజ చేసినటువంటి ఓషధీతత్వం కలిగినటువంటి పత్రిలను తీసుకెళ్లి వినాయక నిమజ్జనం పేరుతో నదులలో కల్పించారు మన పెద్దవాళ్లు, ఈ పత్రి యొక్క కలయికచేత నీరు అంతా శుభ్రమై ఆశ్వీజ మాసం నాటికి చక్కటి నీరు ప్రవహించి లోకంలో ఉన్నటువంటి జీవులు పాడవకుండా కాపాడుకున్నటువంటి ప్రయత్నం చేశారు.
భగవతారాధనని సామాజిక ప్రయత్నంతో ముడివేశారు. కాబట్టి శరత్కాలమందు యమధర్మరాజు ఒక కోర పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు జనక్షయం కాకుండా ఉండడానికి అమ్మవారి యొక్క ఉపాసన చేయాలి. అమ్మ మహాకారుణ్యమూర్తి కనుక ఆ తల్లి లోకాలను కాపాడి, బిడ్డలను రక్షిస్తుంది. వసంత ఋతువులో కూడా యమధర్మరాజు ఒక కోర పైకి వస్తుంది. వసంత నవరాత్రుల ప్రారంభంలో కూడా అమ్మవారి ఉపాసన చేస్తారు.
ఉపాసన అన్న మాటలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే అమ్మవారికి దగ్గరగా మనసుని ఉంచడం, ఆవిడ కదలికలను మనసు పట్టుకోగలగాలి, అందుకు ఉపకరణం కావాలి, కేవలం తంతుగా కార్యక్రమం చేసి మనసు అమ్మవారి యందు అన్వయం కాకపోతే ఉపయోగం లేదు, ఎన్ని క్షేత్రాలకు వెళ్లిన, ఎన్ని తీర్థాలకు వెళ్లిన, ఎన్ని నదులకు వెళ్లిన అక్కడ శరీరంతో పాటు, మనసు కూడా శుద్ధి పొందాలి.

Significance of Devi Navratri – దేవి నవరాత్రులలో ఆ తొమ్మిది రోజులు ఎవరిని ఉపాసన చేయాలి?
- మొదటి మూడు రోజులు “మహాకాళేశ్వర” స్వరూపంగా ఉపాసన చేయాలి.
- తరువాత మూడు రోజులు “మహాలక్ష్మి” స్వరూపంగా ఉపాసన చేయాలి.
- తరువాత మూడు రోజులు “మహాసరస్వతి” స్వరూపంగా ఉపాసన చేయాలి.
- పదవరోజు సిద్ధి “విజయదశమిగా” ఉపాసన చేయాలి.
నవరాత్రులు ఉపాసన చేయాలి అని ఎందుకు అంటారు? Significance of Devi Navratri Upasana:
భగవంతుడు కన్నా ఇంకొకటి లేదు, ఉన్నది భగవంతుడు ఒక్కడే అన్న సత్యం తెలిసి వచ్చేటట్టుగా చేస్తుంది 9 అంకె. ఈ జన్మ ప్రయోజనం కలగడానికి అత్యంత యోగ్యమైన ఉపాసన కాలం శారదా నవరాత్రులు. 9 రాత్రులు చేయడానికి కావలసిన శక్తి శరీరం నందు లేకపోతే కనీసంలో కనీసం మూడు రాత్రులు చేయాలి, ఓపిక ఉంటే తొమ్మిది రోజులు కచ్చితంగా ఉపాసన చేయాల్సిందే.
ముందు మూడు రోజులు మహాకాళేశ్వర రూపం. మహాకాళేశ్వర రూపం శాస్త్రమునందు పూర్తిగా భిన్నమైనది. ఈ రూపం అంటే వాహనానికి ప్రాధాన్యత ఉంటుంది, నవరాత్రులలో వాహన సేవకి అంత ప్రాముఖ్యత వచ్చింది, అమ్మవారు సింహ వాహనం మీద వెళుతూ ఉంటుంది, ఆవిడ త్రిశూలం పట్టుకుంటుంది, మనిషి చేసే ఉపాసన వలన మనిషిలో చేరి ఉండిపోయినటువంటి దుర్గుణాలు అన్నీ కూడా వెళ్లిపోవాలి, కొన్ని సద్గుణాలు పొందాలి అంటే ప్రయత్న పూర్వకంగా అలవాటు చేసుకోవాలి.
దుర్గుణాలు పొందాలంటే సాధన అవసరం లేదు. దుర్గుణాలు వాసనా బలంగా వస్తాయి, భగవతి ఉపాసన చేత ఆమె అనుగ్రహం వల్ల మనుషులో ఉన్న దుర్గుణాలు ఒక్కొక్కటిగా రాలిపోవాలి, అలా రాలిపోయేటట్లు చేయగలిగిన లక్షణం ఎవరిలో ఉంది అంటే ఆ తల్లి దుర్గమ్మ లో ఉంటుంది. అందుకే ఆవిడ పేరు “దుర్గ”.
ఎంతో కష్టపడి ఉపాసన చేస్తే తప్ప అసలు ఆవిడ అనుగ్రహం పొందడానికి సాధ్యం కానటువంటి పరదేవత, కేవలం ఆ నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేత, స్మరించినంత మాత్రం చేత, సమస్తమైన శుభములను వర్షించడానికి ఒక రూపాన్ని పొంది కూర్చుంది “దుర్గమ్మ “.
“దుర్గ” అంటే ఐదు అక్షరాలు:
ద – దైత్య నాశనం, ఆమె రాక్షసులను పరిమారుస్తుంది.
ఉ – ఏదైనా కార్యం తలపెట్టగానే అది జరగకుండా అడ్డొచ్చే ప్రతిబంధకాన్ని తీసేస్తోంది.
ర – రోగ నాశనం, శరీరానికి వచ్చే రోగములను పోగొట్టి ఆరోగ్యంగా ఉండి భగవతిని ఉపాసన చేయటానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది.
గ – గత జన్మలో మరియు ఈ జన్మలో ఇధః పూర్వం చేసిన పాపాలను తొలగిస్తుంది.
అ – అకారము చేత శత్రుభయాన్ని తీసేస్తుంది, శత్రుభావన ఎవరు పెట్టుకుంటే ఆ భావన తీసేస్తుంది, భయనాసనం చేస్తుంది. వీటన్నిటిని ఏకకాలం నందు ఇవ్వగలిగినది కాబట్టి “దుర్గ”.
మొదటి మూడు రాత్రులు దుర్గమ్మని ఉపాసన చేస్తారు, ఉపాసన చేసినప్పుడు “చండీ హోమం” చేస్తారు, దుర్గ “సప్తశతి పారాయణ” చేస్తారు, సప్తశతి అంటే 700 శ్లోకాలు ఉండి, మూడు చరిత్రతో ఉంటుంది. అది పారాయణం చేయాలి, ఆ తొమ్మిది రోజులు అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఒక్కసారి శారద నవరాత్రులలో త్రికరణశుద్ధిగా అమ్మవారిని ఉపాసన చేసి “అర్గల స్తోత్రం” చదివితే దాని వలన మంచి స్థితి లభిస్తుంది.
దుర్గమ్మయే మహిషాసురమర్ధిని “మహిషాసురుడు” అంటే రాక్షసుడు, భౌతికంగా అంతరించిపోయి ఉండొచ్చు కానీ ఆ రాక్షస ప్రవృత్తి మాత్రం ఇప్పటికీ లోకంలో బ్రతికి ఉంటుంది, ఆ మహిషాసుడు(రాక్షస ప్రవృత్తి) చచ్చిపోవాలి, మహిషాసురుడు రంబాసుడు యొక్క కొడుకు, రంబాసుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. మూడు లోకాలను గెలవగలిగిన వాడు కొడుకుగా కావాలి అన్నాడు, మహిషాసురుడు పుట్టాడు.
మహిషాసురుడు బ్రహ్మగారు కోసం తపస్సు చేశాడు, బ్రహ్మగారు ప్రసన్నమై ఏమి కావాలి అని అడిగాడు, చావే లేకుండా వరం అడిగాడు, బ్రహ్మగారు అలా కుదరదు ఒక్క కారణం వల్ల చనిపోయేలాగా వరం అడుగు అని అన్నాడు, మహిషాసురుడు దానికి ఆడది నన్నేమి చేస్తుంది, ఆడదాని చేతిలో చనిపోతాను అని వరం కోరాడు, అని ఆడదాన్ని చులకనగా మాట్లాడాడు, మహిషాసురుడు భౌతికంగా చనిపోయాడు కానీ రాక్షస ప్రవృత్తి లోకంలో ఉంది, ఆ రాక్షస ప్రవృత్తి పోవడానికి చండీ పారాయణం, సప్తశతి పారాయణం, కుంకుమార్చనలు, వాహన సేవలు చేస్తే లోకం సుభిక్షంగా ఉంటుంది.
అందుకే మొదటి మూడు రోజులు మహాకాళేశ్వర ఉపాసనలో దుర్గాదేవి దుర్గుణాలను తీసేస్తుంది, తరువాత మూడు రోజులు మహాలక్ష్మి స్వరూపంగా ఉపాసన చేస్తారు, “మహాలక్ష్మి” స్వరూపం “గరుడ వాహనం” మీద వెళ్తుంది, ఎర్రటి బట్టకట్టుకుని, ఎర్రటి రంగులో ఉంటుంది, ఎర్రటి పూల చేత, మారేడు దళాల చేత పూజింపబడుతుంది. అటువంటి తల్లి సుగుణాలను ఇస్తుంది. కనుక మహాలక్ష్మి ఉపాసన వల్ల మన ప్రయత్నం లేకుండానే అమ్మవారి అనుగ్రహం చేత మంచి ఆలోచనలు వస్తాయి అవే సుగుణాలు.
తరువాత మూడు రోజులు సరస్వతి దేవిని ఉపాసన చేస్తారు అందుకే సరస్వతి పూజ, శారద నవరాత్రులు అని పేరు మహా సరస్వతి స్వరూపం వివేకాన్ని ఇస్తుంది, సరస్వతి పూజ అంటే విద్యార్థులకు మాత్రమే అని అర్థం కాదు, ఆయుధ పూజా అని కూడా అర్థం. నీవు జీవనోపాధి కోసం ఉపయోగిస్తున్న సాధనాలు, కుటుంబాన్ని పోషించే ఆయుధాలు లేదా పనిముట్లు — వాటినే ఆమె విభూతికి ఆధారమైన వస్తువులుగా భావించి పూజించడమే ‘ఆయుధ పూజ’.
(ఉదాహరణకి రైతుకి ఆయుధం నాగలి పంట కోసే వాళ్లకి ఆయుధం కొడవలి శిల్పికి ఉలి పురోహితుడికి పంచాంగం) అలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అందరూ ఒక్కటే, ఆ అమ్మ ప్రధాన స్వరూపమే ఇంద్రకీలాద్రి పర్వత శిఖరం మీద వెలసి ఉంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆవిడ వెలసిన క్షేత్రానికి విజయవాడ(ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా) అనే పేరు. విజయవాడ పట్టణానికి పురాణాలలో విజయవాటిక అనే పేరు ఉంది.
ఈ ఆర్టికల్ లో దేవి నవరాత్రులు యొక్క ప్రాముఖ్యత Significance of Devi Navratri వివరించాము. మీ అమూల్య మైన కామెంట్స్ ని మాకు పంపండి.
దుర్గా ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చదవండి
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:







