Beeramguda Shivalayam Temple Details – బీరంగూడ శివాలయం: చరిత్ర, విశిష్టత మరియు దర్శన సమయాలు:
బీరంగూడ శివాలయం: రెండవ శ్రీశైలంగా పిలవబడే ఈ క్షేత్ర విశిష్టత:
తెలంగాణ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక క్షేత్రాలలో బీరంగూడ శివాలయం (Beeramguda Shivalayam Temple) అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్ పరిధిలోని ఒక అందమైన గుట్టపై వెలసిన ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో “రెండవ శ్రీశైలం” అని పిలుచుకుంటారు. ఈ వ్యాసంలో ఈ పురాతన ఆలయ చరిత్ర, ఇక్కడి ప్రత్యేకతలు మరియు దర్శన సమయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఈ దేవాలయంలో అత్యంత విశిష్టమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, శివుడు ఎప్పుడు ఊరికి ఉత్తరాన, కొండ గుహల్లో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటాడు, భక్తులకు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా భగవంతుడిని సేవించుకునే విధంగా పూర్వం ఋషులు, మునులు ఈ శివాలయాలను ఏర్పాటు చేశారు.

📢 Join Our WhatsApp Channel here:
నేషనల్ హైవేకి 2.5 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇది ఆరవ శతాబ్దం నాటి దేవాలయంగా చెప్పబడుతుంది. పూర్వకాలంలో ఋషులు, మునులు పాదాచారులై దేవాలయాలకు వెళ్ళేటటువంటి ఆచారం ఉండేది, అందుకని అంత దూరం శ్రీశైల పర్వతాలకు వెళ్లి శివుడిని దర్శించుకుని రావటం అంటే చాలా కష్టమైనటువంటిది, ఎవరైనా వెళ్లారు అంటే చాలా అదృష్టంగా భావించేటటువంటి రోజులు, అటువంటి రోజుల్లో శ్రీశైలం వెళ్లాలంటే కష్టం కాబట్టి శ్రీశైలంలో ఉన్నటువంటి దేవుడని ఇక్కడ ప్రతిష్టించుకుంటే బాగుంటుంది అని ఋషులు ఇక్కడ స్వామివారిని మల్లికార్జునుడిగా ప్రతిష్టించి, భృగు మహర్షి తన తపస్సు చేసిన శక్తిని అంతటిని ధార పోశారని ఇక్కడున్న కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తుంది అని చెప్తారు.

ఈ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. కార్తీక మాసంలో ప్రతి సోమవారం అత్యంత రద్దీగా ఉంటుంది, ఈ దేవాలయంలో “నమ:శ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర” అన్న నామంతో ఎప్పుడు మారుమోగుతూనే ఉంటుంది. కార్తీకమాసంలో తెల్లవారు జామున 3 గంటల నుంచి దీపారాధన, అభిషేకము జరుగుతూనే ఉంటాయి, శ్రావణమాసం, మహాశివరాత్రి కూడా విశేషంగా చేస్తారు. మార్గశిర మాసం ఆద్ర నక్షత్రం రోజు కూడా అమ్మవారిని, అయ్యవారిని కలిపి భక్తులు సేవించుకుంటారు.
గర్భాలయంలో ప్రత్యేక రజత మండపం మధ్యలో శివలింగం ఉంటుంది, ఈ శివాలయంలో శివలింగం చతురస్రాకారంలో ఉంటుంది. ఇక్కడ శివుడు అమ్మ వారితో కలిసి ఉంటాడు, మహాశివరాత్రి రోజు విశేషంగా ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం ఎదురుగా 5 అంతస్తుల రాజగోపురం దానిమీద పంచ కలశాలు ఉంటాయి. ప్రతి అంతస్తు పైన వివిధ దేవత మూర్తులు ఉంటారు, రాజగోపాలం దాటగానే ప్రధాన దేవాలయం ఉంటుంది. దేవాలయానికి ఎదురుగా నుంచుని ఎడమవైపు నుంచి వెళ్తే ముందు గణపతి ఆలయం కనిపిస్తుంది. దాని నుంచి అలా కుడి పక్కకు తిరిగి వెళ్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, దాని తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం తర్వాత కాలభైరవ స్వామి విగ్రహం, దాని తర్వాత నవగ్రహాలు ఉంటాయి.
ఈ దేవాలయం బయట పెద్ద మర్రి చెట్టు ఉంటుంది.

భ్రమరాంబ దేవికి దసరా నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి విశేషంగా జరుగుతాయి. అమ్మవారు గర్భాలయంలో స్థానిక భంగిమలో చతుర్బాహులతో ఉంటుంది, రజిత కవచాభరణాలు, వెండి మకర తోరణాలు, కిరీటంతో, పుష్పాలతో జగన్మాత అందంగా కనిపిస్తుంది. అమ్మవారి ముందున్న శ్రీచక్రం నిత్య కుంకుమార్చనతో అలరారుతుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రత్యేక కుంకుమార్చన చేస్తారు, లలిత సహస్రనామ పారాయణం నిత్యం చేస్తారు. మంగళ, శుక్రవారంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు, భ్రమరాంబ దేవి మందిర గోడలపై లలితాంబిక, నటరాజస్వామి, దక్షిణామూర్తుల విగ్రహాలు ఉంటాయి, అమ్మవారు పసిడిఛాయ లో ఉంటుంది.
Beeramguda Shivalayam Temple Timings – ఆలయ సమయాలు:
ఉదయం: 05:30 AM నుండి 12:00 PM వరకు.
సాయంత్రం: 05:00 PM నుండి 8:00 PM వరకు.
ఈ దేవాలయంలో వినాయకుడు, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, కాలభైరవ స్వామి ఉపాలయాలు కూడా ఉంటాయి. ఈ ఉపాలయాలలో ఆయా దేవతలకు సంబంధించిన విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గోపురం మీద 4 వైపుల ఆయన వాహనమైన నెమలి విగ్రహాలు ఉంటాయి. ఆలయం నుండి శ్రీశైలానికి స్వరంగ మార్గం ఉన్నట్టుగా చెబుతారు.

Beeramguda Shivalayam Temple Pooja Fee Schedule – పూజా రుసుముల వివరములు:
| 1 | అర్చన | రూ. 50.00 |
|---|---|---|
| 2 | అమ్మవారి కుంకుమార్చన | రూ. 100.00 |
| 3 | స్వామి వారి అభిషేకం | రూ. 250.00 |
| 4 | అంతరాలయ అభిషేకం | రూ. 650.00 |
| 5 | మహాన్యాసపూర్వక ఏకవారాభిషేకం | రూ. 1116.00 |
| 6 | మాస శివరాత్రి రోజున స్వామి వారి కళ్యాణం | రూ. 2500.00 |
| 7 | ద్విచక్ర వాహన పూజ | రూ. 100.00 |
| 8 | కారు/ ట్రాక్టర్ వాహన పూజ | రూ. 200.00 |
| 9 | లారీ / బస్సు వాహన పూజ | రూ. 500.00 |
| 10 | నవగ్రహ పూజ | రూ. 250.00 |
గమనిక: పైన తెలిపిన పూజా కార్యక్రమాలకు కావాల్సిన పూజా సామాగ్రి భక్తులు సమకూర్చుకోవాలి.
Special Pooja Fee Schedule – ప్రత్యేక పూజలు రుసుముల వివరములు:
- ప్రతీ నెల పౌర్ణమి రోజున చండీ హోమము – రూ. 1116.00
- ప్రతీ నెల మాస శివరాత్రి రోజున రుద్ర హోమము – రూ. 1116.00
- సంకష్టహర చతుర్థి రోజున ప్రదోష వ్రతం – రూ. 1116.00
గమనిక: పైన తెలిపిన పూజా కార్యక్రమాలకు కావాల్సిన పూజా సామాగ్రి భక్తులు సమకూర్చుకోవాలి. - వేదం ఆశీర్వచనం – రూ. 1116.00
(జన్మ దినము, వివహ వార్షికోత్సవం, వధూ వరులకు స్వామి వారి శేష వస్త్రములు మరియు ప్రసాదములు ఇవ్వబడును)
Beeramguda Shivalayam Temple Sasvata Annadana Padhakam – శాశ్వత అన్నదాన పధకం:
- రూ. 25,116/- చెల్లించిన దాతలు పోషకులుగా పిలవబడతారు.
- రూ. 51,116/- చెల్లించిన దాతలు రాజ పోషకులుగా పిలవబడతారు.
- రూ. 1,01,116/- చెల్లించిన దాతలు మహారాజ పోషకులుగా పిలవబడతారు.
ప్రతీ సోమవారం దేవాలయమునందు అన్నదాన వితరణ జరుపబడును.
Beeramguda Shivalayam Temple Surrounding Photos:
How to Reach Beeramguda Shivalayam Temple from Hyderabad? (హైదరాబాద్ నుంచి బీరంగూడ గుట్ట శివాలయం దేవాలయానికి ఎలా వెళ్లాలి?)
1. సొంత వాహనం లేదా టాక్సీ ద్వారా (By Car or Taxi)
మీరు హైదరాబాద్ నగరం నుండి ముంబై జాతీయ రహదారి (NH 65) ద్వారా ప్రయాణించాలి.
మార్గం: హైదరాబాద్ → అమీర్‌పేట్ → కూకట్‌పల్లి → మియాపూర్ → చందానగర్ → పటాన్‌చెరు వైపు వెళ్లే దారిలో బి.హెచ్.ఇ.ఎల్ (BHEL) దాటాక బీరంగూడ కమాన్ వస్తుంది.
అక్కడ నుండి కుడివైపుకు తిరిగి సుమారు 1-2 కిలోమీటర్లు ప్రయాణిస్తే బీరంగూడ గుట్ట ఆలయానికి చేరుకోవచ్చు.
2. బస్సు ద్వారా (By Bus)
హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి బీరంగూడకు సిటీ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
పటాన్‌చెరు వెళ్లే ఏ బస్సు ఎక్కినా మీరు బీరంగూడ బస్టాప్‌లో దిగవచ్చు.
ముఖ్యమైన బస్సు నంబర్లు: 218, 219, 222, 225 (కోఠి, సికింద్రాబాద్, మెహదీపట్నం నుండి).
బస్టాప్‌లో దిగాక ఆలయానికి వెళ్లడానికి ఆటోలు నిరంతరం అందుబాటులో ఉంటాయి.
3. మెట్రో రైలు ద్వారా (By Metro)
మీకు దగ్గరలోని మెట్రో స్టేషన్ నుండి మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించండి (ఇది రెడ్ లైన్ చివరి స్టేషన్).
మియాపూర్ నుండి బీరంగూడ సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుండి మీరు బస్సు లేదా ఆటో/క్యాబ్ ద్వారా సులభంగా చేరుకోవచ్చు.
Google Maps Location:
ముగింపు:
హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉండి కూడా ప్రశాంతతను అందించే శైవక్షేత్రం బీరంగూడ శివాలయం. ఒకరోజు ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇది అద్భుతమైన గమ్యం. శివ భక్తులు తప్పక దర్శించాల్సిన ఆలయం ఇది. ఓం నమః శివాయ.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి అనుగ్రహం పొందే అద్భుత పూజ ఇక్కడ చదవండి
📢 Join Our WhatsApp Channel here:



















