చిలుకూరు బాలాజీ దేవాలయం కోర్కెలు తీర్చే ‘వీసా బాలాజీ’ క్షేత్ర విశిష్టత | Chilkur Visa Balaji Temple 2025

chilkur visa balaji temple
Spread the love

Table of Contents

Chilkur Visa Balaji Temple: చిలుకూరు బాలాజీ దేవాలయం పూర్తి చరిత్ర

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో వెలసిన అద్భుత పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం. గండిపేట చెరువు ఒడ్డున ప్రకృతి ఒడిలో వెలసిన ఈ స్వామిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇక్కడ హుండీ ఉండకపోవడం, ఎటువంటి రుసుము లేకుండా ఉచిత దర్శనం లభించడం ఈ ఆలయ ప్రత్యేకత. ఈ ఆర్టికల్‌లో మనం అసలు ఈ ఆలయం ఎలా వెలసింది వివరంగా తెలుసుకుందాం.

📢 Join Our WhatsApp Channel here:

button

Chilkur Visa Balaji Temple History చిలుకూరు బాలాజీ ఆలయ స్థల పురాణం – స్వయంభువుగా వెలసిన స్వామి:

chilkur visa balaji temple

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల కొండపై వెలసిన ఆ వేంకటేశ్వర స్వామియే భక్తుడి కోసం ఇక్కడ 500 సంవత్సరాలకు పైగా పురాతనమైన స్వయంభువుగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఒక భక్తుడు ప్రతి ఏటా చిలుకూరు నుండి తిరుమలకు నడిచి వెళ్లేవాడు. వయసు పైబడటంతో ఒకసారి అతను నడవలేని స్థితికి చేరుకున్నాడు. అప్పుడు స్వామి అతని స్వప్నంలో కనిపించి, “నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను మీ ఊరిలోనే ఒక పాము పుట్టలో ఉన్నాను” అని ఆనవాళ్లు చెప్పారు.

ఆ భక్తుడు ఆ స్వప్నం గురించి ఆ ఊరిలో వాళ్లకి చెప్పి వాళ్ళని తీసుకుని  ఆ ఆనవాళ్ళతో కనిపించినటువంటి పుట్టని వెతికి తవ్వడం మొదలు పెట్టారు,  గడ్డపార పుట్టలోని స్వామి విగ్రహానికి తగిలి రక్తం ఏరులై పారింది, ఎవరైతే గడ్డపారతో గాయపరిచారో   వారి మీద స్వామి ఆవిర్భవించి, “ఒళ్లంతా గాయపరిచారు మీరు పాలు పోస్తే నేనే స్వయంగా ప్రకటితమవుతాను” అని చెప్పారు,స్వామి చెప్పినట్టు పాలు  పోయగానే,  మట్టి కరిగిపోయి స్వామి కనిపించారు. ఇప్పటికీ స్వామివారి ఎడమ కంటి పైన మరియు వక్షస్థలంపై ఆ గాయం తాలూకు గీతను మనం చూడవచ్చు.  స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు భూదేవి ఉంటుంది.

ఇక్కడ స్వామివారి చమత్కార అనుగ్రహం ఉంది,  అర్చకులు అందరూ ఆ దేవాలయ  నీటి వసతి కోసం బోరు తవ్వించాలని నిర్ణయించుకుని బోరు తవ్విస్తున్నప్పుడు, నీళ్లు రాకపోతే ఒక పూజారి లోపలికి వెళ్లి ప్రదక్షిణలు చేయడం మొదలుపెడతారు,  11వ ప్రదక్షిణ అవగానే నీళ్లు వచ్చాయి, అయినా కూడా ఆయన ప్రదక్షణలు ఆపకుండా చేస్తూనే ఉంటాడు, ప్రదక్షిణ ఆపితే నీళ్లు ఆగిపోతాయేమో అన్న భయంతో, 108వ ప్రదర్శన అవగానే  బోర్  దానంతట అదే ఆగిపోతుంది.

ప్రదక్షిణ చేసే ఆయన అక్కడికి వెళ్లి చూస్తే బోర్ మళ్లీ తిరగడం మొదలైంది. ప్రదక్షిణ చేస్తే బోర్ లో నీళ్లు వచ్చాయి, నీళ్లు పుష్కలంగా వచ్చాయి అన్న కృతజ్ఞతతో  108  ప్రదక్షిణలు అయ్యాయి అన్న భావన  కలగడం జరిగింది, వచ్చిన భక్తులకు అలా చెప్పడం జరిగింది.

స్వామివారికి భక్తులు పుష్పాలు, కొబ్బరికాయలు మాత్రమే సమర్పిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకించి ఎటువంటి ప్రసాదం ఇవ్వరు, మనం కొట్టిన కొబ్బరికాయలో ఒక కొబ్బరి చక్కని ప్రసాదంగా తీసుకోవాలి, లోపల కొబ్బరికాయలు కొట్టకూడదు, బయట కొబ్బరికాయలు కొట్టడానికి ఒక స్థలాన్ని నిర్ణయించారు అక్కడ మాత్రమే కొబ్బరికాయలు కొట్టాలి. దేవాలయం శుభ్రం చేయడానికి ప్రత్యేక సిబ్బంది అంటూ ఎవరు ఉండరు, ఎవరైనా వారంతట వారు సేవ చేయవచ్చు. శుభ్రంగా ఉంచడానికి, సేవ చేసే వారికి  ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎవరికివారు డస్ట్ బిన్స్ ఉపయోగించడం మంచిది. ఇక్కడ ఈ పద్ధతిని అనుసరిస్తారు.

Chilkur Balaji Temple Goshala – చిలుకూరు బాలాజీ గోశాల:

స్వామివారి దేవాలయం వెనకాల అర్చక స్వాములచే నడిపిస్తున్న గోశాల ఉంది, దాదాపు 40 గోవులు ఉంటాయి, ఆ గోవు పాలతోనే స్వామివారికి అభిషేకం జరుగుతుంది.

ఈ దేవాలయంలో ధ్వజ స్తంభం దగ్గర ఉన్న ద్వారం నుంచి బయటకు వెళ్తే, అక్కడ ఒక శివాలయం ఉంటుంది, శివాలయం దగ్గర పెద్ద చెట్టు కూడా ఉంటుంది,  ఇంతకుముందు శివాలయంలో  స్పర్శ  దర్శనాన్ని  ఇచ్చేవారు,  ఇప్పుడు భక్తుల రద్దీ కారణంగా  దూరం నుంచి మాత్రమే దర్శనం చేసుకోవాలి.

ఇక్కడ నుండి 18 కిలోమీటర్ల దూరంలో “తంగేళ్లపల్లి వెంకటేశ్వర స్వామి” దేవాలయం ఉంది, చేవెళ్లలో “వెంకటేశ్వర స్వామి” దేవాలయం, కొంచెం దూరంలో “గాయత్రీ మాత” దేవాలయం, మంచి రేవుల “వెంకటేశ్వర స్వామి దేవాలయం” ఇవన్నీ చాలా ప్రాచీనమైన దేవాలయాలు.

ఈ దేవాలయంలో హుండీ ఉండదు. ఎందుకు అంటే  దేవాలయాలను పరిరక్షించే ఉద్యమంలో భాగంగా స్వామి వారి హుండీ ఆలయంలో అర్చక స్వామి వారు తొలగించారు, అర్చక స్వాములు ప్రభుత్వంతో పోరాటం చేసి 2001లో హుండీ తొలగించారు, హుండీలు లేవు, కానుకలు లేవు, విరాళాలు స్వీకరించరు.

Chilkur Visa Balaji Temple Story – వీసా బాలాజీగా ఎలా ప్రసిద్ధి చెందారు?

ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు తమకు వీసా (VISA) రావాలని కోరుకుంటూ 11 ప్రదక్షిణలు చేయడం, వారి కోరికలు నెరవేరడం వల్ల ఈ స్వామికి “వీసా బాలాజీ” అనే పేరు వచ్చింది. కేవలం వీసా మాత్రమే కాదు, ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా స్వామి అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం.

108 Pradakshinas in Chilkur Visa Balaji Temple Significance: ప్రదక్షిణల విశిష్టత మరియు పద్ధతి:

చిలుకూరులో భక్తులు తమ కోరికలు నెరవేరాలని 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు చేస్తారు.

ప్రదక్షిణల్లో రకాలు:

  1. రాజగోపురం లోపల: ఇక్కడ కోరిక కోరుకుని 11 ప్రదక్షణలు చేయాలి, అనుకున్నది నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయాలి. శుక్ర, శని, ఆదివారాల్లో, విశేష పర్వదినాలలో లోపల ప్రదక్షిణలు నిలిపివేస్తారు.

  2. రాజగోపురం బయట (మహా ప్రదక్షిణం): రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు (శుక్ర, శని, ఆదివారాల్లో, విశేష పర్వదినాలలో) బయట ప్రదక్షిణలు చేయాలి. బయట చేసే ఒక ప్రదక్షిణ, లోపల చేసే 11 ప్రదక్షిణలతో సమానం, రాజగోపురం దగ్గర మొదలుపెట్టి చుట్టూ తిరిగి మళ్లీ రాజగోపురం దగ్గరికి వస్తే ఒక మహాప్రదక్షణ చేసినట్టు. కోరిక కోరుకుని 1 ప్రదక్షణ చేసి అనుకున్నది నెరవేరిన తర్వాత 11 ప్రదక్షిణలు చేయాలి.

గమనిక: ఆలయం మూసివేసే అరగంట ముందు లోపల ప్రదక్షిణలు నిలిపివేస్తారు. కానీ రాజగోపురం బయట చేసే మహా ప్రదక్షిణలు ఎప్పుడైనా చేయవచ్చు.

chilkur visa balaji temple

Chilkur Visa Balaji Temple Garuda Prasadam గరుడ ప్రసాదం మరియు సంతాన బాలాజీ:

ప్రతి ఏటా చైత్ర మాసంలో స్వామివారి “గరుడ ప్రసాదం” ఇస్తారు. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. సంతానం కలిగిన వారు స్వామికి “సంతాన బాలాజీ” అని పేరు పెట్టుకుని మొక్కులు తీర్చుకుంటారు. ప్రతి శుక్రవారం అభిషేకము అయిన తర్వాత స్వామివారి స్వరూపం పైన పూసిన పసుపు కొంచెం స్వామివారి ప్రసాదంగా స్వామివారి అనుగ్రహం కలిగే లాగా ప్రత్యేకంగా కోరుకున్న వారికి ఇస్తారు, దానివల్ల కూడా సంతానం కలుగుతుందని చాలామంది భక్తుల నమ్మకం. ఈ ప్రసాదం కావాల్సిన వారు  శుక్రవారం రోజు ఉదయం గం.9:30ని. కల్లా  ఆలయానికి  చేరుకోవాలి.

Chilkur Visa Balaji Temple Timings చిలుకూరు బాలాజీ దేవాలయ సమయాలు:

దర్శనం / కార్యక్రమంసమయం
ఉదయం వేళలు6:00 AM నుండి 1:00 PM వరకు
సాయంత్రం వేళలు4:00 PM నుండి 7:00 PM వరకు
నైవేద్యం సమర్పణఉదయం 9:30 AM
శుక్రవారం అభిషేకంఉదయం 9:30 AM నుండి 10:30 AM వరకు
ఆలయం మూసివేసే సమయంరాత్రి 7:00 PM

ఏడాదికి ఒకసారి ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి, చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిరోజు, ధ్వజారోహణం ఉంటుంది, తర్వాత ఏడు రోజులు ఉత్సవాలు జరుగుతాయి, స్వామివారికి చైత్ర పౌర్ణమి రోజు  రథోత్సవం, ఏకాదశి రోజు ధ్వజారోహణం, అదే రోజు గరుడ ప్రసాదం ఇస్తారు, కృష్ణపక్ష ద్వితీయ రోజు చక్రస్నానం జరుగుతుంది. ప్రతి శుక్రవారం గోశాలలో అన్నదానం జరుగుతుంది.

ఆలయ ప్రత్యేకతలు:

  • హుండీ లేని ఆలయం: ఈ ఆలయంలో హుండీ ఉండదు. భక్తుల నుండి విరాళాలు, కానుకలు స్వీకరించరు.

  • కొబ్బరికాయ ప్రసాదం: ఆలయంలో ప్రత్యేక ప్రసాదాలు విక్రయించరు. భక్తులు కొట్టిన కొబ్బరికాయలో ఒక చెక్కను ప్రసాదంగా తీసుకోవాలి.

  • శుభ్రత: ఆలయ శుభ్రతకు ప్రత్యేక సిబ్బంది ఉండరు, భక్తులే స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు.

  • గోశాల: ఆలయం వెనుక ఉన్న గోశాలలోని గోవుల పాలతోనే స్వామికి అభిషేకం నిర్వహిస్తారు.

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు – Chilkur Balaji temple chief priest Sri MV Soundararajan Garu:

చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు మరియు వారసత్వ ట్రస్టీ అయిన డాక్టర్ శ్రీ ఎం.వి. సౌందరరాజన్‌ గారికి ‘సాంప్రదాయ సంరక్షణ దీప’ అనే ప్రతిష్టాత్మక బిరుదు లభించింది. 85 ఏళ్ల వయసులో ఆయనకు లభించిన ఈ గౌరవం, దేవాలయ వ్యవస్థను ప్రభుత్వ జోక్యం, రాజకీయ ప్రభావాలు మరియు వాణిజ్య ధోరణుల నుంచి రక్షిస్తూ ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన నిరంతర సేవలకు గుర్తింపుగా అందించారు.

డాక్టర్ శ్రీ ఎం.వి. సౌందరరాజన్ గారు ఎం.కాం., ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి, వాణిజ్య శాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆయన విద్యారంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ‘ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ను కూడా అందుకున్నారు.

ఆలయ పరిపాలనలో సంస్కరణలు:

చిలుకూరు బాలాజీ దేవాలయంలో డాక్టర్ సౌందరరాజన్ గారు ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆయన అమలు చేసిన ముఖ్యమైన విధానాలు ఇవి:

  • హుండీ లేని ఆలయ వ్యవస్థ
  • విఐపీ దర్శనం లేకుండా అందరికీ ఒకే క్యూలో దర్శనం
  • టికెట్ విధానం రద్దు (Free Darshan to All Devotees)
  • అర్జిత సేవల నిర్వహణ లేకపోవడం
  • నగదు కానుకలు స్వీకరించని సంప్రదాయం

ఈ విధానాల ద్వారా దేవాలయ దర్శనంలో సమానత్వం, పారదర్శకత మరియు భక్తి భావానికి ప్రాధాన్యత లభించింది.

హైదరాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయానికి ఎలా వెళ్లాలి – How to Reach Chilkur Visa Balaji Temple from Hyderabad?

హైదరాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి రోడ్డు మార్గం అత్యంత సౌకర్యవంతమైనది.

  • దూరం: సుమారు 30 కి.మీ
  • ప్రయాణ సమయం: 40 నిమిషాల నుంచి 1 గంట వరకు (ట్రాఫిక్‌పై ఆధారపడి ఉంటుంది)

ప్రధాన మార్గం:

మెహిదిపట్నం → లంగర్ హౌజ్ → చిలుకూరు బాలాజీ దేవాలయం

స్వంత కారు, ద్విచక్ర వాహనం లేదా క్యాబ్ (Ola / Uber) ద్వారా నేరుగా ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం సమీపంలో వాహనాల పార్కింగ్ సదుపాయం ఉంది.

బడ్జెట్ ప్రయాణం కోరుకునే భక్తులకు Telangana RTC బస్సులు ఉత్తమ ఎంపిక.

  • ప్రారంభ స్థానం: మెహిదిపట్నం బస్ స్టేషన్
  • బస్సు నంబర్లు: 288C, 288D
  • దిగవలసిన స్థలం: చిలుకూరు బాలాజీ బస్ స్టాప్
  • ప్రయాణ సమయం: సుమారు 45 నిమిషాలు – 1 గంట

బస్ స్టాప్ నుంచి ఆలయం నడిచే దూరంలో ఉంటుంది.

రైలు మార్గం ద్వారా చిలుకూరు బాలాజీ ఆలయానికి చేరుకోవచ్చా?

చిలుకూరు వద్ద నేరుగా రైల్వే స్టేషన్ లేదు. అయితే సమీప స్టేషన్ల నుంచి రోడ్డు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

హైదరాబాద్ డెక్కన్ (నాంపల్లి) – సుమారు 25–30 కి.మీ


విమాన మార్గం ద్వారా చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకోవడం:

ఇతర రాష్ట్రాల నుండి / దేశాల నుండి వచ్చే భక్తులకు సమీప విమానాశ్రయం:

  • రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్
  • దూరం: సుమారు 28–35 కి.మీ

విమానాశ్రయం నుంచి క్యాబ్ ద్వారా నేరుగా చిలుకూరు బాలాజీ దేవాలయానికి చేరుకోవచ్చు.

Google Maps Location:

ముగింపు:

భక్తికి, క్రమశిక్షణకు నిలయం చిలుకూరు బాలాజీ క్షేత్రం. ఈ ఆలయం చుట్టూ గండిపేట చెరువు, మధ్యలో స్వామి  ఆలయం  ఉంటుంది. ఆడంబరాలు లేని ఈ ఆలయంలో స్వామిని దర్శించుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. మీరు కూడా మీ కోరికలు నెరవేరాలని ఆశిస్తుంటే, ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి 11 ప్రదక్షిణలు చేయండి.

గమనిక: ఈ సమాచారం భక్తుల విశ్వాసం మరియు ధార్మిక గ్రంథాల ఆధారంగా సేకరించబడింది. ఆలయ సమయాలు మరియు పూజా వివరాలలో మార్పులు ఉండవచ్చు, కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను ఒకసారి తనిఖీ చేయగలరు.

పౌర్ణమికి రంగులు మారే అద్భుత శివలింగ దర్శనం మీ పుణ్యఫలం ఇక్కడ చదవండి   

మీకు ఈ వ్యాసం నచ్చితే:

  • ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.

  • మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.

  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

📢 Join Our WhatsApp Channel here:

button



Spread the love

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *