పంచారామ క్షేత్రాలు (Pancharama Kshetras) ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ ఉన్నాయి?
హిందువులకు మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన పర్వదినం. అనేక శుభదినాల్లో భక్తులు పరమశివుని భక్తి, విశ్వాసంతో పూజిస్తారు. శివార్చన సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మహిమాన్విత శివలింగ క్షేత్రాలను దర్శించేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ప్రస్తావించాల్సినవి ఆంధ్రప్రదేశ్‌లోని పంచారామ క్షేత్రాలు. పేరు చెబుతున్నట్లుగానే, పరమేశ్వరుడికి అంకితమైన ఐదు పవిత్ర శైవ దేవాలయాలను కలిపి పంచారామాలు అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో శివారామాలున్నప్పటికీ, పంచారామాలకు ఉన్న ప్రాధాన్యం మరింత విశిష్టమైనది. ఈ ఐదు పవిత్ర దేవాలయాలు ఆంధ్రప్రదేశ్‌లోని భిన్న పట్టణాల్లో విస్తరించి ఉన్నాయి.
పంచారామాలు(Pancharama Kshetras) అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ద్రాక్షారామం, సామర్లకోట, అమరావతి, పాలకొల్లు, భీమవరంలో ఉన్నాయి. ప్రాంతీయ పురాణాల ప్రకారం ఈ ఆలయాలలోని లింగాలను ఆరామములుగా సూచిస్తారు.
📢 Join Our WhatsApp Channel here:
పంచారామ క్షేత్రాలు :
సామర్లకోటలో “భీమారామము”
తూర్పుగోదావరి జిల్లాలో “ద్రాక్షారామము”
పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు లో “క్షీరారామము”
భీమవరంలో సోమారామము,
గుంటూరు జిల్లా అమరావతిలో “అమరారామము”.
పంచారామ క్షేత్రాలు(PanchaRama kshetras) అంటే ఏమిటి అవి ఎలా వెలిశాయి:
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు మహా శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి, ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు, మెడలో శివలింగాన్ని ధరించి సమస్త లోకాలను భయభ్రాంతులను చేశాడు. ఆ రాక్షసుడిని చంపడానికి సుబ్రహ్మణ్యస్వామి సర్వ సైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుడు మెడలో ఉన్న శివలింగాన్ని భేదించాడు, శివలింగం విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు లింగం అరిగి చిన్న ముక్క ఉన్న అదే లింగం, కాబట్టి ఇప్పుడు ఆ లింగం ఐదు ముక్కలై పడింది, ఐదు ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ 5 ఆరామములు వచ్చాయి, అవే పంచారామ క్షేత్రాలు . పంచారామ క్షేత్రాలలో నాలుగు “భోగ లింగాలు” ఒకటి “యోగ లింగం”(భీమారామము).

పంచారామ క్షేత్రాలు పురాణ, చారిత్రక, ఆధ్యాత్మికంగా అతి విశిష్టమైన ఐదు శైవ తీర్థాలు. శివుడికి ప్రత్యేకంగా అంకితమైన ఈ పవిత్ర దేవాలయాలను ఒకసారి అయినా జీవితంలో తప్పకుండా దర్శించాలి.
మీకు ఈ వ్యాసం నచ్చితే:
ఈ సమాచారాన్ని మీ మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఆలయ విశేషాల కోసం మా వెబ్‌సైట్ telugushine.com ను చూస్తూ ఉండండి.
మీకు ఏమైనా సందేహాలు ఉంటే క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
📢 Join Our WhatsApp Channel here:








